లోకేష్‌ నోరు అదుపులో పెట్టుకో..

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌

లోకేష్‌ పెద్ద కమెడియన్‌

లోకేష్‌ది యువ గందరగోళం యాత్ర

లోకేష్‌ ఐరన్‌లెగ్‌ .. వైయస్‌ జగన్‌ ఐరన్‌ మ్యాన్‌ 

 రాజకీయాల్లో లోకేష్‌ ఎల్‌కేజీ జీరో..వైయస్‌ జగన్‌ కేజీఎఫ్‌ హీరో 

తాడేపల్లి: నారా లోకేష్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎం వైయస్‌ జగన్‌ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ హెచ్చరించారు. మేం కూడా ఆ స్థాయికి దిగి చంద్రబాబును దుర్భాషలాడగమని చెప్పారు. లోకేష్‌ పాదయాత్ర కామెడీ సినిమాను తలపిస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి గొప్ప కమెడియన్‌ దొరికాడు. కమెడియన్‌ పాత్రకు లోకేష్‌ పూర్తి న్యాయం చేస్తారని తెలిపారు. మాయాబజారు సినిమాలో రేలంగి పాత్ర ఎలాంటిదో రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్‌ పాత్ర అలాంటిదన్నారు. లోకేష్‌ యాత్ర అంతా బూతులే అన్నారు. లోకేష్‌ ఏ స్థాయిలో మాట్లాడితే అలానే మేం మాట్లాడతామని హెచ్చరించారు. లోకేష్‌ది యువ గందరగోళం యాత్ర అని అభివర్ణించారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నాగార్జున యాదవ్‌ మీడియాతో మాట్లాడారు.

 •  
 •  ఐరన్‌లెగ్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్ః
          యువగళం పేరుతో లోకేశ్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ అపశకునాలే. అన్నీ దుర్ఘటనలే. ఆ పాదం మహిమ అలాంటిది... ఐరన్‌లెగ్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్ అని లోకేష్ అని అంతా భావిస్తున్నారు.  అలాంటి పాదంతో లోకేశ్‌ చేసే పాదయాత్రలు జనావళికి ప్రమాదాలు, దుర్మరణాల రూపంలో.. పాదయాత్ర,  బలియాత్రగా మారింది. పదిరోజుల పాదయాత్ర కాస్తా టీడీపీకి పాడెయాత్రగా మారిపోయింది.  నారా వారి ఉసురు నందమూరి కుటుంబానికీ తగులుతోంది. బాబు, లోకేశ్‌ల యాత్రల ప్రభావం  గుంటూరు, కందుకూరుల్లోనే కాదు చివరికి టర్కీ, సిరియాలపైనా చూపిస్తున్నాయి. ఇంకోవైపు  అప్రయోజకుడైన కొడుకును చూసి, నవ్వాలో, ఏడవాలో దిక్కుతోచని స్థితి చంద్రబాబుది.  క్రేన్లతో ఒకవైపు బాబు, మరోవైపు ఎల్లో మీడియా గొట్టాలను వినియోగించి లోకేశ్‌ను ఎంతగా పైకి లేపాలనుకున్నా,  లేపలేక మీరంతా చతికిలపడుతుంటే ఇదంతా జనానికి మహా వినోదంగా మారింది.  మిషన్లు లేస్తున్నాయి కాని ఈ లోకేశ్‌ లేవడం లేదు. కడుపుబ్బ నవ్వించే హాస్యనటుడిగా లోకేశ్ మిగిలిపోయాడు. జగన్ గారిని మీరు ఒకటంటే.. మేం నాలుగంటాం.. ఒళ్ళు, నోరు అదుపులో పెట్టుకొని లోకేశ్ మాట్లాడాలి. లేకపోతే ఒరేయ్ చంద్రబాబు అని మేము కూడా మాట్లాడతాం..

  లోకేశ్ బూతులు వినడానికి జనం రావాలా..?
  - ఎందుకు లోకేశ్‌ పాదయాత్రకు జనం రావడం లేదని బాబు సమీక్షించాడట... వారు ఏం చేసినా జనం రాకపోవడంతో, ఇక చేసేదేం లేక మీడియా ముందుకు బాబు, లోకేశ్ లు వచ్చి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారిని, బడుగు బలహీన వర్గాలను తిట్టడం తప్ప వేరే ఏమీ చేతకావడం లేదు. ఎవరైనా పాదయాత్రకు ఎందుకు వస్తారు. వచ్చే నాయకుడు తమకు ఏదైనా భరోసా ఇస్తాడనో, లేదా తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుతాడేమోనన్న ఆశకొద్దీ వస్తారు. 
  - మరి లోకేశ్‌ పాదయాత్రలో అలాంటి భరోసా లభిస్తుందా...అని జనం ప్రశ్నించుకుని, ఇది ఉత్త పప్పేలే ... అతను మాట్లాడే బూతులు వినడానికి రావాలా? ...అని ఎవరూ రావడం లేదు. 

  అజ్ఞానికి టక్కు-టై కడితే అది లోకేశ్ః
  - ఇతగాడికి నాలిక మందం...ప్రశాంతత అని పలకలేక ప్రశాంతత్త అంటాడు.. వైశ్యులు పదం పలకబోయి వైశాలి అంటాడు. పనిముట్లు పలకడం చేతకాక పందిముట్లు అంటాడు...అజ్ఞానానికి టక్కు, టై కట్టి, దానికి  పేరేం పెట్టాలంటే లోకేశ్‌ అని సమాధానం వస్తుంది. ఇలాంటి చేతకాని దద్దమ్మ, మాట్లాడడమే చేతకాని సన్నాసితో బాబు బూతులు మాట్లాడిస్తున్నాడు. అయినా నీ తోలు మందం నాలికతో నోరు జారితే..  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులుగా కాసేపు సభ్యతను పక్కన పెట్టి కుక్కకాటుకు చెప్పు దెబ్బలా..అంతకుమించి తిట్టగలం...  పాదయాత్రలో సభ్యతా సంస్కారాలను మరిచిపోయి, ఈ ఐరన్‌ లెగ్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లోకేశ్,  జగన్‌ గారిని అరేయ్, ఒరేయ్ అని నోటికొచ్చినట్లు దూషిస్తున్నాడు. దూషించడం తనకొక్కడికే తెలిసిన విద్య అని భ్రమపడుతున్నాడు. ఒరేయ్‌ సన్నాసి బాబు...అని మేమూ తిట్టగలం..కాకపోతే మా నాయకుడు మాకు సభ్యత, సంస్కారం నేర్పించారు. 

  లోకేశ్ యాత్రతో బాబుకు సన్ స్ట్రోక్ః
  - తన  పార్టీ వారే ఇలాంటి మొద్దబ్బాయి లోకేశ్‌ ప్రసంగాలు వినలేక చెవులు మూసుకుని, ఇలాంటి పప్పును ఎందుకు తెచ్చి మాకు అంటగట్టావని అడుగుతుంటే దిక్కుతోచని బాబు కలుగులో దాక్కున్న ఎలుకలా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని స్థితిలో పడిపోయాడు. 
  -  అయినా సమర్ధుడైన కొడుకుంటే ఏ తండ్రయినా పవన్‌ కళ్యాణ్‌పై ఎందుకు ఆధారపడతారు? ఈ పది రోజుల యాత్రలో లోకేశ్‌ చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తున్నాడు. ఈ పాదయాత్ర దెబ్బకు చంద్రబాబుకు సన్‌స్ట్రోక్‌ తగిలేలా ఉందని టీడీపీ నాయకులకూ ఈ పాటికే  అర్థమైపోయింది.  

  రాజకీయాల్లో సరికొత్త హాస్యనటుడుః
  - ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారీటీల సంక్షేమానికి ... అన్ని పేద వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ మోహన్‌రెడ్డి గారు పరిపాలన చేస్తుంటే.. లోకేశ్, తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటూ ముఖ్యమంత్రి గారిపై నోటికొచ్చినట్లు పేలుతున్నాడు. నోరు తెరిస్తే బూతుల పంచాంగం విప్పుతున్నాడు.  మర్యాద, సభ్యతా సంస్కారాలను మరిచి జగన్‌గారిని లోకేశ్‌ సంబోధించే తీరు  చాలా ఏహ్యంగా ఉందని జనమే తిట్టుకుంటున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్‌కు ఒక సరికొత్త హాస్యనటుడు దొరికాడని నవ్వుకుంటున్నారు. ఉత్తరకుమారుడికి ప్రగల్భాలు ఎక్కువ...లోకేశ్‌కు ఉడత ఊపులు ఎక్కువ అని నవ్విపోతున్నారు. 
  -  ఈ ఐరన్‌ లెగ్‌ చౌదరి లోకేశ్‌తో ఐరన్‌ మ్యాన్‌, సూపర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అయిన జగన్‌ గారితో  తలపడితే తట్టుకోగలడా అని మేం అడుగుతున్నాం. 
  - ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో లోకేశ్ ... మరోసారి జగన్‌ గారిపై నోరు జారావంటే  నీ తండ్రి చంద్రబాబును అంతకు రెండింతలుగా తిడతామని హెచ్చరిస్తున్నాం... అంటూ నాగార్జున యాదవ్‌ మండిపడ్డారు. 

Back to Top