కాపీ కొట్టడంలో చంద్రబాబు మాస్టర్‌ డిగ్రీ

చంద్రబాబును ప్రజలు నమ్మరు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసురెడ్డి పద్మ

హైదరాబాద్‌:కాపీ కొట్టడంలో చంద్రబాబు మాస్టర్‌ డిగ్రీ చేశారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను అచ్చు తప్పు లేకుండా పూర్తి యథావిధిగా టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు ప్రకటించారన్నారు.గత ఐదేళ్లుగా ఆరోగ్యశ్రీని పక్కనపెట్టిన చంద్రబాబుకు ఈ పథకం మరోసారి గుర్తుకు వచ్చిందన్నారు.చంద్రన్న పెళ్ళికానుక,ఉద్యోగాల నోటిఫికేషన్‌ క్యాలెండర్,ఉద్యోగాల కల్పన,స్థానికులకే ఉద్యోగాలు వంటివన్నీ వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోలో అంశాలే అన్నారు.బాబు ఆలోచనలు,టీడీపీ మేనిఫెస్టో ప్రజలకు అవుట్‌డేట్‌ అంశాలన్నారు.ఎన్నిక నాటకాలాడిన చంద్రబాబును ప్రజలు నమ్మరన్నారు.

Back to Top