బాబు మీడియా నమ్ముకుంటే.. జగన్ జ‌నాల‌ను నమ్ముకున్నారు 

ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడింది.

వైయస్‌ జగన్‌ ప్రజాదరణను టీడీపీ ఓర్వలేకపోతోంది

ఓటమి భయంతోనే ఓట్లు తొలగింపు 

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య

వైయస్‌ఆర్‌ జిల్లా: చంద్రబాబు మీడియాను నమ్ముకున్నారని, వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలను నమ్ముకున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార  ప్రతినిధి సీ.రామ‌చంద్ర‌య్య పేర్కొన్నారు. జేడీ లక్ష్మి నారాయణకు చంద్రబాబు అవినీతి కనిపించడం లేదా ఆయ‌న ప్ర‌శ్నించారు.  వైయస్‌ఆర్‌ జిల్లా  వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు..చంద్రబాబు చేసిన పెద్ద పొరపాటు మీడియాను నమ్ముకున్నారని, అదే ఆయనను నిలబెడుతుందనే భ్రమలో ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ముఖ్యమని,వారే బతికిస్తారని తెలిపారు.వైయస్‌ జగన్‌ ప్రజలను నమ్ముకున్నారన్నారు. ఖచ్చితంగా వైయస్‌ జగన్‌ను ప్రజలు సీఎం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

జేడీ లక్ష్మినారాయణ అవినీతిపై పోరాటం ఏమయ్యిందని ప్రశ్నించారు. 23 మంది  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. అసెంబ్లీలో స్పీకర్‌ వ్యవస్థను అప్రతిష్టపాలు చేశారన్నారు. ప్రజలకు అసెంబ్లీ ద్వారా సమస్యలను వినిపించకుండా  ప్రతిపక్షం గొంతుకు నొక్కేశారని  ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ ప్రజల సమస్యలు తెలసుకోవాలనే సంక్పలంతో  పాదయాత్ర చేశారన్నారు.వైయస్‌ జగన్‌పై ఎల్లో మీడియా ద్వారా దుష్ఫ్రచారాలు చేయించారన్నారు.  పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు.

వైయస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు,టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు.చంద్రబాబు ఓటమి భయం పట్టుకుందని  వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో  ఓటర్ల తొలగించే కార్యక్రమం చేపట్టారన్నారు. డేటాచోరీ కేసులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవో అశోక్‌పై పోలీసులు కేసు నమోదు చేసి,లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారన్నారు.అటువంటి వ్యక్తిని చంద్రబాబు సంక్షరణలో పెట్టుకోవడం ఎంత వరుకు సమంజసం అని ప్రశ్నించారు.ఆంధ్ర,తెలంగాణ  సెంటుమెంట్‌ను చంద్రబాబు రేపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రంలో పాలన గాలికొదిలేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా వైయస్‌ జగన్‌ గురించే ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును సొంత రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారన్నారు. గతంలో సోనియాగాంధీ, కేసీఆర్, జగన్‌  ఒక్కటేనన్న చంద్రబాబు నేడు మోదీ,కేసీఆర్,జగన్‌ ఒకటే అంటున్నారని చురకలు అటించారు. .

ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధి  కుంటుపడిందన్నారు.ఐదు సంవత్సరాలు తన వ్యక్తిగత కారణాలతో శకునివలే రాష్ట్రాభివృద్ధిని అడ్డుకున్నారన్నారు.చంద్రబాబుకు ఈడి రాసిన లెటర్‌ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.చంద్రబాబుబే ఉత్తరం రాయించారని అనుమానం వ్యక్తం చేశారు.ఈడి చెప్పినంత మాత్రాన సీబీఐ చర్యలు తీసుకోవాలని లేదన్నారు.రెండూ స్వతంత్ర సంస్థలన్నారు. చంద్రబాబు ఎలక్షన్‌ ముందు అన్నిరకాల విన్యాసాలు చేస్తున్నారన్నారు.చంద్రబాబు తన  ఈ నెల రోజులు వైయస్‌ జగన్‌పై అవాస్తవాలు ప్రచారం చేస్తారని తెలిపారు.కుటిల ఆలోచనలతో ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారు.
 

తాజా వీడియోలు

Back to Top