డీఎస్సీ అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ సమరశంఖం 

శాసనమండలిలో డీఎస్సీ అవకతవకలపై చర్చించేందుకు ఎమ్మెల్సీలు చంద్రశేఖర్‌రెడ్డి, కల్పలతారెడ్డి, రామచంద్రారెడ్డి వాయిదా తీర్మానం 

తాడేపల్లి:  డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే ముందుగా మంత్రి పదవి నుంచి లోకేష్‌ తప్పుకోవాలని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో డీఎస్సీ అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ శాసనసభ, శాసనమండలిలో పోరాటానికి సిద్ధమైంది. శాసనమండలిలో డీఎస్సీ అవకతవకలపై చర్చించేందుకు ఎమ్మెల్సీలు చంద్రశేఖర్‌రెడ్డి, కల్పలతారెడ్డి, రామచంద్రారెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. డీఎస్సీ అక్రమాలపై చర్చించాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలోకి ప్రదర్శనగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి 
డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే లోకేష్‌ పదవిలో కొనసాగకూడదని పేర్కొన్నారు. డీఎస్సీ విషయంలో ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీలు ప్రశ్నలు సంధించారు. మీకు అనుకూలంగా జీవోలు మార్చుకుంటారా? అంటూ నిలదీశారు. అసలు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ రాజకీయాలకు పాల్పడటం మానుకోవాలని సూచించారు. డీఎస్సీ ఫలితాల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి ఫస్ట్‌ ర్యాంక్‌ రావడంపై ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఎంపిక ప్రక్రియపై అనేక సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు. మంత్రి లోకేష్‌ వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు నవ్వుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.

మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ: ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి  
ఇది మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీగా మారిందని మండిపడ్డారు. స్పోర్ట్స్‌ కోటా పేరుతో డీఎస్సీలో అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. డీఎస్సీ వ్యవహారంలో బాధ్యత వహించే నైతికతను మంత్రి లోకేష్‌ చూపించాలని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసినట్టే డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్‌ కూడా రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అసలు సమస్యను పక్కనపెట్టి డైవర్షన్‌ రాజకీయాలు చేయకుండా డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ వ్యవహారంలో నిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ విచారణతో పాటు బాధ్యత వహించాల్సిన వారు పదవుల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలపై శాసనమండలిలో వైయ‌స్ఆర్‌సీపీ పోరాటాన్ని కొనసాగించనుంది. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు.

Back to Top