లండన్: రానున్న ఎన్నికలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. యూకే వైయస్ఆర్ సీపీ కన్వీనర్ డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నాయకుడు ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో లండలో వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా సమావేశం దిగ్విజయంగా సాగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైయస్ఆర్ సీపీ రాష్ట్ర మీడియా, సోషల్ మీడియా కో- ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి , APNRTS అధ్యక్షులు మేడపాటి వెంకట్ , APSSDC రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి , వైయస్ఆర్ సీపీ అమెరికా కన్వీనర్ పండుగాయల రత్నాకర్ పాల్గొన్నారు. UK నలుమూలల నుంచి 450 మందికి పైగా వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సజ్జల భార్గవ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రతి క్షణం జగనన్న కష్టపడుతున్నారు. ప్రజా సంక్షేమమే కాదు అవినీతి పరుల గుండెల్లో సింహ స్వప్నంగా జగనన్న నిలిచారు. దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడే జగనన్నకు మనం అందరం అండగా నిలవాలి. ఏపీలో గ్రామాలను సీఎం జగనన్న ఎంత అభివృద్ధి చేశారో మీరందరూ భారత దేశం వచ్చినప్పుడు చూస్తే ఆశ్చర్య పోతారని అన్నారు. రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో ఎలా పని చేయాలో ఆయన కార్యకర్తలకు వివరించారు. పార్టీ 175/175 టార్గెట్ గా అందరం కలిసి చేద్దామని, మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటానని సోషల్ మీడియా కార్యకర్తలకు భార్గవ్‌రెడ్డి భరోసా కల్పించారు.