దళితుల ఆత్మబంధువు వైయ‌స్ జగ‌న్‌

వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్‌బాబు

అనంత‌పురం:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ద‌ళితుల ఆత్మ‌బంధువు అని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్‌బాబు పేర్కొన్నారు.  వైయస్ జగన్‌ను మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిని చేసుకుంటేనే ద‌ళితుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. అనంతపురం నగరంలోని  A-7 కన్వెన్షన్ హాల్లో ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు నరసింహులు అధ్యక్షతన ఎస్సీ విభాగం విస్తృత స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో సుధాక‌ర్‌బాబుతో పాటు పార్టీ జిల్లా అధ్య‌క్షుడు  అనంత వెంకటరామిరెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు బోరెడ్డి నరేష్ కుమార్ రెడ్డి ,  శింగణమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ , ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, జెడ్పి చైర్పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం, పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధాక‌ర్‌బాబు మాట్లాడుతూ... సమిష్టిగా పని చేస్తూ పార్టీ బలోపేతానికి ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌న్నారు.  ప్రతి ఒక్కరికీ అండగా వైయ‌స్ జ‌గ‌న్ ఉంటార‌ని ధైర్యం చెప్పారు.  స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాల‌ని, అంద‌రికీ స‌మానంగా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని చెప్పారు. కూటమి ప్ర‌భుత్వ వైఫల్యాల‌ను, కుట్రలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల‌ని,  కష్టపడేవారికి పార్టీలో తప్పకుండా గుర్తుంపు ఉంటుంద‌ని ఉద్ఘాటించారు.
 

Back to Top