వైయ‌స్ఆర్‌సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర.. 12వ రోజు షెడ్యూల్  

 తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. ఈరోజు(గురువారం) సామాజిక సాధికారిత బస్సుయాత్ర అనకాపల్లి, పామర్రు, కావలి నియోజకవర్గాల్లో జరుగనుంది. అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్‌ ఆధ్వర్యంలో సాధికార యాత్ర కొనసాగనుంది. ఉదయం గం. 10:30 ని.లకు మారేడుపూడిలో యాత్ర ప్రారంభం కానుంది. మారేడుపూడి నుంచి తేగడ గ్రామం వరకూ భారీ ర్యాలీగా బస్సుయాత్ర జరుగనుంది.  11 గంటకు తేగడ గ్రామంలో జగనన్న హౌసింగ్‌ కాలనీని పరిశీలించనున్నారు. 12 గంటలకు తేగడలో ఏపీ మోడల్‌  స్కూల్‌ పరిశీలన, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం తేగడ గ్రామం నుండి ఎన్టీఆర్‌ స్టేడియం వరకూ భారీ బైక్‌ ర్యాలీ ఉండనుంది. మూడ గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

కృష్ణాజిల్లా పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రియా టవర్స్‌ వద్ద నాయకుల ప్రెస్‌ మీట్‌.. గం. 2:30ని.లకు ప్రియా టవర్స్‌ వద్ద నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మ‌ధ్యాహ్నం గం. 3:30 ని.లకు పామర్రు సెంటర్‌లో బహిరంగ సభ ఉండనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా, మంత్రి జోగి రమేష్‌, ఎంపీ నందగం సురేష్‌ సురేష్‌, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తదితరులు పాల్గొననున్నారు.

నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో విలేకర్ల సమావేశం ఉంటుంది. ఈ కార్యక్రమం అనంతరం ఒంగోలు బస్టాండు సెంటర్‌లోని అబ్దుల్‌ కలాం విగ్రహానికి వైయ‌స్ఆర్‌సీపీ నేతలు నివాళులు అర్పించనున్నారు.  అనంత‌రం దర్గాని సందర్శించి, మార్కెట్‌ సెంటర్‌ వరకూ పాదయాత్ర ఉండనుంది. సాయంత్రం గం. 4:30కి మార్కెట్‌ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Back to Top