తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైయస్ఆర్‌సీపీ పార్టీ రీజనల్ కో-ఆర్డీనేటర్ల సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో వైయస్ జగన్ బస్సుయాత్ర, రూట్ మ్యాప్, మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చ కొనసాగుతోంది. మూడు పార్టీల కూటమిని ఎదుర్కొనే కార్యచరణపై పార్టీ నేతలకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే మొత్తం అభ్యర్థుల్ని ప్రకటించిన వైయస్ఆర్‌సీపీ ప్రచారంపై దృష్టి పెట్టింది. ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. దాదాపు నెలపాటు జనంలోనే ఉండనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ఇంటరాక్షన్.. మధ్యాహ్నం/సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తొలి విడతలో బస్సు యాత్ర.. ఆ తర్వాత ఎన్నిలక ప్రచార సభలు ఉండనున్నాయి. ప్రజలతో మమేకమై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.