విజయనగరం: వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్ జగన్ పరిపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. పార్టీ పటిష్టతకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అనంతరం కార్యకర్తల నుంచి సలహాలు తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజాంలో వైయస్ఆర్ సీపీని గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.