ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన పార్టీ అధినేత వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ఎమ్మెల్యే కోటాలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున‌ శాసనమండలికి పోటీ చేస్తున్న ఏడుగురు అభ్య‌ర్థుల‌కు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీఫాంలు అందజేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు పెనుమత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, ఇజ్రాయిల్, మ‌ర్రి రాజశేఖర్, జయమంగళం వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంలు పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా బీఫాంలు అందుకున్నారు. శాసనమండలి సభ్యులుగా పోటీ చేసేందుకు తమకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు కృతజ్ఞతలు తెలిపారు. మరికాసేపట్లో ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు నామినేషన్లు వేయనున్నారు. 

Back to Top