రైతాంగానికి అండగా వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన

13న రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు. వినతిపత్రాలు

‘అన్నదాతకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ’ పేరుతో కార్యక్రమం

కార్యక్రమం పోస్టర్లు జిల్లాల్లో రిలీజ్‌ చేసిన పార్టీ నేతలు

తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలుగా నష్టపోతున్న రైతుల సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన చేపడుతోంది. ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించడంతో పాటు, అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనుంది. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ మంగళవారం రిలీజ్‌ చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమ పోస్టర్లు రిలీజ్‌ చేసిన నాయకులు, సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ర్యాలీ నిర్వహణపై చర్చించారు.
    రైతులకు పెట్టుబడి సాయంగా అంతకు ముందు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా రూ.13,500కు బదులు, పథకం పేరు మార్చి రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన కూటమి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పింది. ఈ ఏడాది 2 సీజన్లలోనూ ఒక్క రూపాయి కూడా రైతులకు పెట్టుబడి సాయంగా ఇవ్వలేదు.
    ఇటీవల వరుస తుపాన్లపై ముందస్తు సమాచారం ఉన్నా, ఎక్కడా రైతులను ఆదుకునే యోచన చేయలేదు. పౌర సరఫరాల మంత్రి కానీ, సీఎం కానీ కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. ప్రభుత్వం ఉండి కూడా ఏ సహాయం చేయకపోవడంతో, రైతులు నిస్సహాయులయ్యారు. దీంతో భారీ వర్షాలకు కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముదై్దంది. 
    మరోవైపు గతంలో ఈ–క్రాప్‌ విధానంతో, ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరణ పకడ్బందీగా జరగ్గా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పద్ధతికి మంగళం పాడింది. ఈ–క్రాప్‌ లేదు. ఆర్బీకేలు నిర్వీర్యమయ్యాయి. దీంతో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైంది. ఆ వ్యవహారమంతా మళ్లీ దళారుల చేతుల్లోకి వెళ్లింది. ఫలితంగా పంటలకు గిట్టుబాటు ధర అన్న మాటే లేకుండా పోయింది. రైతులు ఒక్కో 75 కేజీల« ధాన్యం బస్తాపై రూ.325 వరకు నష్టపోతున్నారు. 
    ఇంకా వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వంలో ధాన్యం సేకరణ సందర్భంగా రైతులకు పక్కాగా,  గన్నీబ్యాగ్‌లు, లేబర్, రవాణా ఖర్చులు అందించింది. ఒకవైపు ప్రభుత్వం స్వయంగా ధాన్యం సేకరించడం, మరోవైపు ఈ వ్యయాన్ని కూడా భరించడం వల్ల, రైతులకు కచ్చితంగా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) లభించడంతో పాటు, అదనంగా రూ.252 దక్కాయి.
    ఫోన్‌లో మెసేజ్‌ పెడితే చాలు, వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని, రైతుల నుంచి ప్రతి గింజ ధాన్యం కొంటామన్న పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాటలు నీటి మూటలయ్యాయి.
తాము ఎన్ని మెసేజ్‌లు పెట్టినా, ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా, ఏ స్పందనా లేదని రైతులు చెబుతున్నారు.

ఈ దారుణ పరిస్థితి నేపథ్యంలో రైతులకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది.
ఈనెల 13న ఇదీ ఆ కార్యక్రమ కార్యాచరణ:
    ధాన్యం సేకరణలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తూ.. రైతులకు తప్పనిసరిగా మద్ధతు ధర కల్పించాలని డిమాండ్‌ చేయడంతో పాటు, పెట్టుబడి సాయంగా ఇస్తామన్న రూ.20 వేలు కూడా ఇవ్వాలని కోరడం. వాటితో పాటు, ఇప్పటివరకు రైతులకు అందుతున్న ఉచిత పంటల బీమాను వర్తింప జేయాలన్న డిమాండ్‌ తో రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం సమర్పిస్తారు.

ర్యాలీ కార్యక్రమంపై వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఏమన్నారంటే..:

అనంత వెంకటరామిరెడ్డి. పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు.
– రైతులకు భరోసా కల్పించడం లో చంద్రబాబు సర్కార్‌ విఫలమైంది.
ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో సీఎం సమాధానం చెప్పాలి. రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తామన్న రూ.20 వేలు ఎందుకు ఇవ్వడం లేదు?. 

విశ్వేశ్వర్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే.
– రైతులంటే చంద్రబాబుకు చులకనా? వారికి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలి. కరవు కాటకాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

తలారి రంగయ్య. మాజీ ఎంపీ.
– రాయలసీమ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలం. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీల కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి.

ఎస్వీ మోహన్‌రెడ్డి. పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు.
– కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోంది. గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి సహాయం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల ఏ సమస్య అయినా పరిష్కరిస్తామని గొప్పగా చెప్పిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఆ సమస్యలు కనిపించడం లేదా? ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించలేదు.

కాటసాని రాంభూపాల్‌రెడ్డి. పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు.
– అకాల వర్షాల సమయంలోనూ ప్రభుత్వం నిద్ర పోతోంది. పంటలు కాపాడేందుకు కనీస చర్యలు చేపట్టడం లేదు. అనేక చోట్ల« ధాన్యం నీట మునిగి రంగు మారినా, ఆ ధాన్యం కొనుగోలును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు దిగాలుగా చూస్తున్నారు. ఆ నెపాన్ని ఉద్యోగులపై వేసి తప్పించుకోవాలని సీఎం ప్రయత్నిస్తున్నారు.

భూమన కరుణాకర్‌రెడ్డి. పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు.
– 20 ఏళ్ల క్రితమే చంద్రబాబు రైతు వ్యతిరేకి. ఉచిత కరెంటు ఇస్తామని ఆనాడు వైయ‌స్ఆర్‌ చెబితే, అది అసాధ్యమని, అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని ప్రచారం చేసిన వ్యక్తి చంద్రబాబు. రైతుల రుణమాఫీ చేస్తామని 2014లో హామీ ఇచ్చి ఎగ్గొట్టారు. ఇప్పుడు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామని, ఆ మాట కూడా తప్పారు. 

ఆకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి. రాజంపేట ఎమ్మెల్యే.
– టీడీపీని నమ్మి ప్రజలను ఓటేస్తే చంద్రబాబు వారిని మోసం చేశారు. కేవలం మా పార్టీని, వైయ‌స్ జగన్‌గారిని నిందించడంలోనే కూటమి పెద్దలు కాలం వెళ్లదీస్తున్నారు. అనేక సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నా, ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. నిజానికి కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలవారు నానా ఇబ్బంది పడుతున్నారు.

ధర్మాన కృష్ణదాస్‌. పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు.
– రైతుల పట్ల కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. ప్రభుత్వ తీరుతో ధాన్యం కొనుగోళ్లు లేక, రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. దళారుల చేతుల్లో రైతుల తీవ్రంగా నష్టపోతున్నారు. వారికి ఎమ్మెస్పీ కూడా లభించడం లేదు.

అన్నదాతను నట్టేటా ముంచిన కూటమి ప్రభుత్వం:  మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్   

  • రైతులను నట్టేటా ముంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం
  • ఓట్లేయించుకుని వారిని దగాచేసిన కూటమి ప్రభుత్వం
  • అన్నదాతా సుఖీభవ అంటూ పచ్చి మోసం 
  • ఏడాదికి రూ.20వేలు ఇస్తామంటూ సూపర్ సిక్స్ హామీ కనుమరుగు
  • జగనన్న ఇచ్చిన రైతుభరోసాకూ ఎసరు
  • ఖరీఫ్ ముగిసింది, రబీ వచ్చింది అయినా ఆచూకీలేని అన్నదాత సుఖీభవ
  • పెట్టుబడి సహాయం అందక రైతులు గగ్గోలు 
  • బడ్జెట్లో రూ.10,700 కోట్లు పెట్టాల్సి ఉండగా దాని ప్రస్తావనే లేదు
  • జగనన్న హయాంలో ఏటా క్రమం తప్పకుండా డా వైయస్సార్ రైతు భరోసా
  • రైతు భరోసా కింద మేనిఫెస్టోలో పెట్టింది ఏడాది రూ.12,500
  • కాని మరో వేయి పెంచి ఇచ్చింది  ఏడాదికి రూ.13,500
  • చెప్పిన దానికంటే మిన్నగా, గొప్పగా అమలు చేసిన జగనన్న
  • ఐదేళ్లలో 53.52లక్షల మందికి రూ.34,288 కోట్ల పెట్టుబడి సహాయం
  • అంతకంటే మిన్నగా చేస్తానని చంద్రబాబు హామీ
  • మరోసారి రైతులను చీట్ చేసిన చంద్రబాబు
  • 2014లో ఇలాగే బేషరతుగా పంట రుణ మాఫీ చేస్తానంటూ మోసం
  • కుర్చీకోసం హామీలు, అధికారం దక్కాక మోసాలు, ఇదీ చంద్రబాబు నైజం
  • కూటమి ప్రభుత్వ నమ్మకద్రోహాన్ని నిలదీయాలి
  • ఏడాదికి రూ.20వేల పెట్టుబడి సహాయంకోసం పోరాడాలి
  • పథకం వచ్చేంతవరకూ చంద్రబాబును నిగ్గదీయాలి
  • కూటమి హామీకోసం, పెట్టుబడి సహాయంకోసం రైతు పోరుబాట
  •  
  • రైతు కష్టం దళారుల పాలు:

కూటమి పాలనలో రైతుల కష్టం దళారుల పాలు
రైతుకు కన్నీళ్లు మిగులుస్తున్న చంద్రబాబు 
ధాన్యానికి లభించని కనీస మద్దతు ధర
75 కేజీల బస్తా కనీస మద్దతు ధర రూ.1725లు.
కాని బాబు పాలనలో రూ.1300ల లోపే 
రూ. 400ల మేర నష్టపోతున్న రైతులు
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దళారీల ప్రవేశం
సిండికేట్గా మారి రైతులను దోచుకుంటున్న తీరు
అయినా నిద్రపోతున్నకూటమి సర్కార్
దిక్కుతోచక అయినకాడికి అమ్ముకుంటున్న రైతులు
ఫోన్లో హాయ్ మెసేజ్ పెడితే చాలన్న మంత్రి
రైతులు వేలసార్లు హాయ్లు చెప్పినా కరుణించేవారు కనిపించడంలేదు

అకాల వర్షాల సమయంలోనూ నిద్రపోతున్న ప్రభుత్వం
రైతుల పంటను కాపాడేందుకు కనిపించని చర్యలు
అనేక ప్రాంతాల్లో నీట మునిగిన ధాన్యం
రంగు మారిన ఈ ధాన్యం కొనుగోలు పట్టించుకోని ప్రభుత్వం
దిగాలుగా చూస్తున్న రైతులు 
నెపాన్ని దగువ స్థాయి ఉద్యోగులపై వేసి తప్పించుకునే ప్రయత్నంలో చంద్రబాబు
అందుకే ఎల్లోమీడియాలో జోరుగా వక్రీకరణలు 

గత ప్రభుత్వ హయాంలో పంటల ఈ–క్రాపింగ్, ఆర్బీకేల ద్వారా కొనుగోలు ప్రక్రియ
రైతులకు తప్పనిసరిగా మద్దతు ధర
బస్తాకు కనీసంగా రూ.1900ల రేటు
వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వ హయాంలో 2019–23 మధ్య 37.70 లక్షల రైతుల నుంచి 3,40,24,000 టన్నుల ధాన్యం సేకరణ
రైతులకు రూ.65,255 కోట్లు చెల్లింపు
గత టీడీపీ హయాంలో 2014-19 మధ్య 17.94 లక్షల రైతుల నుంచి 2.65 కోట్ల టన్నుల ధాన్యం సేకరణ
రైతులకు ఇచ్చింది రూ.40,236 కోట్లు మాత్రమే 
రెండు ప్రభుత్వాల మధ్య స్పష్టమైన తేడా ఇదీ

ఇంకా వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్ ద్వారా శాస్త్రీయంగా పంటల సాగు లెక్కలు 
రైతుల కల్లాల నుంచి ధాన్యం మిల్లుకు చేరే వరకు అధికారులు పర్యవేక్షణ
రైతుల నుంచి శాంపిళ్ళ సేకరణ
గన్నీబ్యాగులు, రవాణా వాహనాలు అందుబాటులో 
ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు 
ఎక్కడా దళారీలు లేని వ్యవస్థను వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం అమలు  
గతంలో గన్నీ బ్యాగులు, హామాలీలు, రవాణా వాహనాలు అన్నీ కూడా దళారీల గుప్పిట్లో ఉండేవి
తొలిసారిగా ఆ ఖర్చులను రైతులకు అందించి వారికి తోడుగా నిలిచిన వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం
అప్పట్లో టీడీపీ ప్రభుత్వం దిగిపోతూ రైతులకు రూ.960 కోట్లు  ధాన్యం బకాయిలు
ఆ బకాయిలు తీర్చిన వైయస్సార్సీపీ ప్రభుత్వం
ఇప్పుడు ఇలాంటి చర్యలేవీ కనిపిచండంలేదు
ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది
ఉద్దేశ పూర్వకంగా రైతుల కష్టాన్ని దళారు పాలు చేస్తోంది.
కనీస మద్దతు ధరకోసం పోరాటం
ఈ ప్రభుత్వం మెడలు వంచాల్సిందే 
రైతుకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ  
ప్రకటించిన ధర రైతుకు రావాల్సిందే
రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే 
తేమ లెక్కలతో రైతుల్ని ఇబ్బందిపెట్టే చర్యలను మానుకోవాలి

ఉచిత పంటలబీమా రద్దు:

రైతుపై మరింత భారం మోపిన కూటమి ప్రభుత్వం
పెట్టుబడి సాయమూ లేదు, కనీస మద్దతు ధరా లేదు
మరోవైపు విజయవంతంగా అమలవుతున్న ఉచిత పంటలబీమా రద్దు
తద్వారా రైతులపై అదనపు భారం
బీమా కావాలంటే డబ్బు కట్టాల్సిందే
బీమా పరిధిలోకి రాని లక్షలమంది రైతులు
విపత్తులు వచ్చినా, అకాల వర్షాలు వచ్చినా రైతులు నష్టపోవాల్సిందే

రైతులపై పైసా భారం పడకుండా 2019-24 మధ్య వైయస్సార్ ఉచిత పంటల బీమా అమలు
నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజీ 
ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోపే రైతుల ఖాతాల్లో జమ 
గడచిన ఐదేళ్లలో 5.42 కోట్ల ఎకరాలకు, 2.04 కోట్ల మందికి బీమా కవరేజీ 

54.55 లక్షల మంది రైతులకు రూ.7,802.08 కోట్ల బీమా పరిహారం 
నేడు ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసిన చంద్రబాబు
అన్నిరకాలుగా రైతును దెబ్బతీస్తున్న చంద్రబాబు

ఆర్బీకే వ్యవస్థా నిర్వీర్యం:

ఆర్బీకేల ద్వారా రైతుల వద్దకే ప్రభుత్వ యంత్రాంగం
రైతు సేవలకు కేరాఫ్గా నిలిచిన ఆర్బీకేలు
అలాంటి గొప్ప వ్యవస్థల ఆచూకీ లేకుండా చేస్తున్న చంద్రబాబు, కూటమి ప్రభుత్వం

జగనన్న హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్బీకేలకు చంద్రగ్రహణంత్తు నుంచి పంట అమ్మకం వరకు రైతన్నకు తోడుగా నిలిచిన ఆర్బీకేలు మటుమాయం
ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు గతంలో అందుబాటులోకి
ఇప్పుడు మళ్లీ పాత కష్టాలే 
ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు, రైతన్నకు మద్దతు ధరతో వెన్నుదన్ను
ఇప్పుడు క్రియాహీనంగా మిగిలిన ఆర్బీకేలు
అన్ని విధాలా అండగా నిలిచిన ఆర్బీకేలను నేడు పథకం ప్రకారం నిర్వీర్యం చేసిన చంద్రబాబు
 

Back to Top