వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ అట్టహాసంగా ప్రారంభం

గుంటూరు: ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ’ (వైయస్‌ఆర్‌ సీపీ) ప్లీనరీ సమావేశం అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్లీనరీ సమావేశాలను ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణుల సమక్షంలో అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్క‌రించి ప్లీనరీ సమావేశాలను ప్రారంభించారు. జోహార్‌ వైయస్‌ఆర్‌.. జై జగన్‌.. జై వైయస్‌ఆర్‌ సీపీ నినాదాలతో ప్లీనరీ ప్రాంగణం దద్దరిల్లింది. ప్లీనరీ సమావేశాలకు హాజరైన లక్షలాది మంది నాయకులు, కార్యకర్తలకు పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అభివాదం చేస్తూ.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  
 

తాజా వీడియోలు

Back to Top