గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు పండగలా జరుగుతున్నాయి. మొదటి రోజు ప్లీనరీ సమావేశాలు విజయవంతం కాగా..రెండో రోజు పార్టీ శ్రేణులు పోటెత్తుతున్నారు. రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని అభిమానులు సైతం కోలాహలంగా ప్లీనరీకి హాజరవుతున్నారు. ఉదయం నుండి వర్షాన్ని లెక్కచేయకుండా ప్లీనరీ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. బీహార్, పాట్నా ప్రాంతాల నుండి ప్లీనరీకి వచ్చామని, తమ పార్టీ అధినేత ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులు అన్నారు. నేడు వైయస్ఆర్ సీపీ అధ్యక్ష ఎన్నిక వైయస్ఆర్ సీపీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం ప్లీనరీ వేదికపై నుంచి వైయస్ఆర్ సీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ విషయాన్ని ప్రకటించారు. శనివారం సాయంత్రం అధ్యక్ష స్థాన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. పార్టీ రాజ్యాంగానికి సంబంధించి రెండు, మూడు సవరణలు కూడా ఉంటాయని తెలిపారు. సీఎం వైయస్ జగన్ ప్రసంగంపై సర్వతా ఆసక్తి.. ప్లీనరీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముగింపు ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణను సీఎం ప్రకటించనున్నారు. రెండో రోజు.. పలు తీర్మానాలు చేయనున్న ప్లీనరీ.. రెండో రోజు వైయస్ఆర్ సీపీ ప్లీనరీలో పలు తీర్మానాలు చేయనున్నారు. పారదర్శక పాలన, వ్యవసాయ రంగం, సామాజిక న్యాయం, దుష్ట చతుష్టయంపై ప్లీనరీ తీర్మానాలు చేయనుంది. తొలిరోజు ప్లీనరీలో 4 రంగాలపై తీర్మానాలు చేశారు. మహిళ సాధికారత , దిశ చట్టం.. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు.. డిబిటి పథకాలు అమలుపై ప్లీనరీ తీర్మానాలు చేసింది.