తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌కు అధికారం లేకపోయినా ప్రజాబలం ఉందని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. కూటమి సర్కార్ వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను వెంటాడి వేధిస్తోంది.. మేము తిరగబడితే కూటమి నేతలు కొట్టుకుపోతారని హెచ్చరించారు. మాజీ మాంత్రి పేర్ని నాని కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. వైయస్ జగన్‌కు ప్రజాబలం ఎక్కువ. జన బలం ఎవరికి ఉందో ఈవీఎం బ్యాచ్‌కి బాగా తెలుసు. ప్రజలను మోసం చేయడానికి వైయస్ జగన్ ఎర్ర పంచ కట్టలేదు. వైయస్ జగన్ సింగిల్‌గా వచ్చి గెలిస్తే.. చంద్రబాబు పొత్తుతో వచ్చాడు. కూటమి సర్కార్ వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను వెంటాడి వేధిస్తోంది. మేము తిరగబడితే మీరు ఎక్కడ ఉంటారో ఒక్కసారి ఆలోచించుకోండి అని హెచ్చరించారు. అలాగే, వైయస్ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు.. కానీ మోసపు మాటలు మాత్రం లేవు. పవన్ తనకు కులం లేదు అని మొన్న చెప్పి.. ఇవాళ కులం ఉంది, మతం ఉందని డ్రామాలాడుతున్నారు. చంద్రబాబుకు అధికారం ఏమైనా శాశ్వతంగా ఉందా?. 2019లో వైయస్ జగన్‌ను 151 సీట్లతో అధికారంలోకి తెచ్చింది కార్యకర్తలే. ఇప్పుడు 2029లో కూడా 175 సీట్లతో కార్యకర్తలే వైయస్ఆర్‌సీపీ ని తిరిగి అధికారంలోకి తెస్తారు అంటూ వ్యాఖ్యలు చేశారు.