విశాఖపట్నం: 15 నెలల పాలనా కాలంలో మహిళలకు ఒక్క రూపాయి కూడా సాయం చేయని కూటమి ప్రభుత్వం ఇప్పుడు... సున్నా వడ్డీ పథకాన్ని నిలిపివేస్తూ డ్వాక్రా మహిళలకు టోకరా వేయడం దారుణమని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో మహిళలకిచ్చిన ఒక్క హామీని అమలుచేయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు సున్నావడ్డీ పథకాన్ని నిలిపివేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. డ్వాక్రా మహిళలు అంటే చంద్రబాబుకి ఎందుకింత పగ అని నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో మహిళలు చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... ● సున్నా వడ్డీకి మంగళం - డ్వాక్రా మహిలకు మోసం: వైయస్.జగన్ హయాంలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన సున్నా వడ్డీ రుణాలను ఎత్తివేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు విద్యా రుణాల పేరిట పావలా వడ్డీకి రుణాలివ్వాలని నిర్ణయించడం పచ్చి మోసం. డ్వాక్రా సంఘాలను నేనే తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు వారికివ్వాల్సిన పథకాలకు మాత్రం ఎగనామం పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో డ్వాక్రా సంఘాలకు కనీసం ఒక్క రూపాయి సాయం చేయకుండా అత్యంత దుర్మార్గంగా వ్యవహరించిన చంద్రబాబునాయుడు ఇప్పుడు కొత్తగా పావలా వడ్డీకి విద్యారుణాలు పేరిట కొత్త మోసానికి తెరతీశారు. ఎన్నికల మేనిఫెస్టోలో సున్నావడ్డీ ఇస్తామని హామీ ఇఛ్చి.... పదిహేను నెలల కాలంలో ఒక్కరికీ ఇచ్చిన పాపాప పోలేదు. గతంలో వైయస్.జగన్ మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే... ఇవాళ చంద్రబాబు నాయుడు మహిళలపై కక్ష కట్టిన ముఖ్యమంత్రిగా నిలిచారు. 2014-19 వరకు ఐదేళ్లలో చంద్రబాబు మహిళలను అన్ని రకాలగా మోసం చేసారు. 2016 అక్టోబరు నుంచి సున్నావడ్డీ నిలిపివేయడంతో ఏ, బీ గ్రేడ్ లు గా ఉన్నా డ్వాక్రా సంఘాలు సీ, డీ గ్రేడ్ లుగా దిగజారిపోయాయి. మరలా వైయస్.జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీకి రుణాలు మంజూరు చేయడంతో తిరిగి ఇవి ఏ, బీ గ్రేడ్ లుగా మారాయి. వైయస్.జగన్ హయాంలో రూ.4969 కోట్లు వారి అకౌంట్లతో వేసి ఆర్దికంగా బలోపేతం చేస్తే.. చంద్రబాబు మాత్రం వారిపై పగతో కక్ష సాధింపు చర్యలకు దిగినట్లే వ్యవహరించారు. ఇవాళ విద్యారుణాల పేరిట పావలా వడ్డీకి ఇస్తామని చెపుతున్న చంద్రబాబు... గతంలో ప్రజా గళం మేనిఫెస్టోలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రూణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని, పండగ, పెళ్లి కానుకలకు పునరుద్దరిస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? కనీసం రూ.3 లక్షలు చొప్పున మహిళలకు ఇచ్చినా దాదాపు రూ.2 వేల కోట్లు వారికి బకాయిలు పడినట్లే లెక్క. ఇవాల్టి వరకు ఒక్క రూపాయి వారికి ఇవ్వకుండా.. పావలా వడ్డీకి రుణాలిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం? ఎన్నికల సమయంలో మేనిఫెస్టో పై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన టీడీపీ నేతలు.. ఇవాళ దాన్ని మర్చిపోయి పూర్తిగా పక్కనపెట్టేశారు. సున్నావడ్డీ పథకం మహిళలకు అత్యంత ఉపయోగ పడే పథకం.. కూటమి నేతలు వీకెండ్స్ లో స్పెషల్ ప్లైట్స్ లో తిరగడానికి పెట్టే ఖర్చు తగ్గించుకుంటే.. సున్నా వడ్డీ పథకాన్ని సులువుగా అమలు చేయవచ్చు. దేశంలో చంద్రబాబు నాయుడు తరహాలో మరే ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్ వినియోగించడం లేదు. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే. ● వైయస్.జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల మహిళలకు మేలు: వైయస్.జగన్ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, కమ్మ, క్షత్రియ,వైశ్య, రెడ్డితో పాటు అన్ని వర్గాల మహిళలకు చేయాత పథకాన్ని ఎంత చక్కగా అమలుచేశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాపునేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో క్రమం తప్పకుండా మహిళల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తూ వారిని ఆర్ధికంగా ఆదుకోవడానికి ఎనలేని కృషి చేశారు. అలాగే రిలయన్స్, పీ అండ్ జీ వంటి పెద్ద పెద్ద సంస్ధతో భాగస్వామ్యులు కావడం ద్వారా ఆయా సంస్ధల సాయంతో మహిళలు స్వయం ఉపాధి పొందేలా తోడ్పాటునందిస్తే... ఇవాళ కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా పగపట్టినట్లు వ్యవహరిస్తోంది. విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో తల్లిదండ్రుల అకౌంట్లలో జమ చేస్తూ ఆడబిడ్డల చదువుకు ఎంతగానో తోడ్పాటు అందించారు. వైయస్.జగన్ హాయాంలో ప్రతి త్రైమాసికానికి ఫీజు రీయింబర్స్ మెంట్ కింద విద్యార్ధుల తల్లిదండ్రుల ఖాతాల్లో క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉన్నత విద్యకు తోడ్పాటునందించారు. ● బాబు పాలనలో చదువులకు దూరమవుతున్న పేద విద్యార్ధులు: నేడు చంద్రబాబు హాయంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పూర్తిగా నీరుగారుస్తూ.... ఏకంగా రూ.6 వేల కోట్లు ఎగనామం పెట్టారు. గతంలో వైయస్.జగన్ విద్యార్దుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్ మెంట్ అమౌంట్ జమ చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలేజీలకు జమ చేస్తామని చెప్పి దాన్ని కూడా ఎగ్గొట్టడం ద్వారా పేదవిద్యార్దులకు ఉన్నత విద్యను దూరం చేయడానికి కంకణం కట్టుకుంది. ఇది ఎంత వరకు సమంజసం ? ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల డిగ్రీ కాలేజీలు బంధ్ కు దిగాయి. దీంతో కాలేజీలు విద్యార్ధులకు సర్టిఫికేట్లు కూడా మంజూరు చేయడం లేదు. ఫలితంగా పేద ఫీజులు చెల్లించడం కోసం పేదవిద్యార్ధుల తల్లిదండ్రులు రూ.10, రూ.20 ల వడ్డీలకు రుణాలు తెస్తూ అప్పులు పాలవుతున్న దుస్ధితి నెలకొంది. కూటమి పాలనలో విద్యా వ్యవస్ధ అంత దారుణంగా దిగజారింది. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఫీజులు కట్టలేక చదువులకు దూరమవుతున్న విద్యార్దులు కూలిపనుల కోసం వలసలు పోతున్న దుస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో కూటమి నేతలు వివిధ రూపాల్లో నడుకుంటూ, సైకిల్ మీ ప్రచారం చేస్తూ మహిళలను లక్షాధికారులను చేస్తాం, సంపద సృష్టిస్తామని మాయ మాటలు చెప్పారు. మహిళలను పారిశ్రామిక వేత్తలను చేస్తానని కూడా హామీ ఇచ్చారు.ఇంట్లో కూర్చుని సంపాదించేలా చేస్తానని మాయమాటలు చెప్పారు. చంద్రబాబు అయితే మహిళలకు వర్క్ ఫ్రమ్ ద్వారా నెలకు రూ.లక్ష వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగం రాకపోతే ఏడాదికి రూ. 36 వేలు వేస్తానని కూడా ప్రకటించారు. 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.48 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా 19 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ. 1500 చొప్పన ఏడాదికి రూ. 18000 ఇస్తాననీ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి, వాటిని తుంగలో తొక్కిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు డ్వాక్రా సంఘ మహిళలను మళ్లీ మోసం చేయడానికి సిద్ధమయ్యారు. ● నిరుద్యోగుల్లో సగం మంది మహిళలే ఉన్నారు: కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం లేని పక్షంలో నెలకు రూ.3 వేలు నిరుద్యోగభృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 15నెలల్లో ఒక్కరి అకౌంట్లోనైనా నిరుద్యోగభృతి వేశారా? అలా లెక్కవేస్తే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఒక్కొక్కరికీ కూటమి ప్రభుత్వం రూ.45వేలు చొప్పున బాకీ పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రం నిరుద్యోగంలో దేశంలోనే మూడో స్ధానానికి ఎగబాకింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిర్వహించిన లేబర్ సర్వే ప్రకారం... 29 ఏళ్లలోపు నిరుద్యోగులు జాతీయ స్ధాయిలో 14.6 శాతం ఉంటేమన రాష్ట్రంలో 21 శాతం ఉంది. నిరుద్యోగ యవకులు 17.9 శాతం కాగా, నిరుద్యోగ మహిళలు 28.5 శాతం ఉన్నారు. ఇంతమంది మహిళా నిరుద్యోగులు ఉంటే వాళ్లను కూటమి ప్రభుత్వం మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ● ప్రతి పథకంలోనూ మోసమే... ఎన్నికల వేళ ఇంటింటికీ ప్రచారం చేస్తూ బాండ్లు సైతం ఇచ్చిన కూటమి నేతలు... 2024 జూన్ నుంచి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తీరా 15 నెలలు గడుస్తున్నా... ఒక్క రూపాయి కూడా ఎవరి అకౌంట్లలో వేయలేదు. కాబట్టి నిరుద్యోగులకు, నిరుద్యోగుల్లో ఉన్న మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాలు కల్పించకుండా, నిరుద్యోగ భృతీ ఇవ్వకుండా చివరకి సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తివేస్తే.. మహిళలు ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మహిళలకు తల్లికి వందనం పేరుతో మరో హామీ ఇచ్చారు. ఆన్ గోయింగ్ స్కీమ్ అయిన్ తల్లికి వందనం మొదటి ఏడాది ఎగరగొట్టిన కూటమి ప్రభుత్వం.. రెండో ఏడాది పథకం డబ్బుల్లో రూ.15 వేలకు బదులు రూ.13 వేలు మాత్రమే ఇచ్చింది. ఎన్నికల టైంలో హామీ ఇచ్చినప్పుడు లేని షరతులు ఇప్పుడెంటుకు పెడుతున్నారు. అమ్మఒడి కింద రూ. రూ. 10.090 కోట్లు మంజూరు చేస్తే... కేవలం రూ. 2290 కోట్లు మాత్రమే ఇచ్చారు. 66.57 లక్షల మందికి తల్లికివందనం విడుదల చేస్తామని చెప్పి.... వాస్తవంగా 63.77 లక్షల మందికి మాత్రమే విడుదల చేశారు. మొత్తంగా రెండేళ్లలో రాష్ట్రంలో ఉన్న విద్యార్ధులందరికీ ఎగనామం పెట్టిన అమౌంట్ రూ.17 వేల కోట్లు కాగా..ఇచ్చింది కేవలం రూ.2,990 కోట్లు మాత్రమే. ఇక ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు నెలకు రూ.1500 ఏడాదికి రూ.18 వేలు వారి అకౌంట్లలో వేస్తామని హామీ ఇచ్చారు. దాని గురించి ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఈ పథకానిఅర్హులైన వారు 2.07 కోట్ల మంది ఉంటే... నెలకు రూ.3 వేల కోట్లు చొప్పున ఏడాదికి రూ.37313 కోట్లు ఖర్చవుతుంది. 15 నెలల పాలనలో రూ.1500 కాదు కదా కనీసం రూ.15 కూడా వారి అకౌంట్లలో జమచేయలేదు. ఈ విధంగా ఆడబిడ్డలను నిట్టనిలువుగా మోసం చేశారు. గతంలో వైయస్.జగన్ హాయంలో సున్నావడ్డీ పథకం, వైయస్సార్ చేయూత, ఈబీసీ నేస్తం, ఆసరా, కాపునేస్తం వంటి పథకాలన్నీ అమలయ్యేవి. ఇప్పుడు అవేవీ లేవు కదా... సున్నా వడ్డీ పథకాన్ని నిలిపివేయడం దారుణం. పెన్షన్ ల విషయానికొస్తే 15 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ మంజూరు చేయలేదు సరికదా... రోజు రోజుకూ పెన్షన్లు కోత విధిస్తున్న దుస్థితి. అదే విధంగా 50 ఏళ్లు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రూ.4 వేలు ఇస్తామన్నారు అది కూడా అమలు చేయడం లేదు.ఈ పథకాలన్నీ ఎప్పుడు అమలు చేస్తారని రాష్ట్ర ప్రజల తరపున కూటమి పెద్దలు ప్రశ్నిస్తున్నాం. ఇక దీపం పథకానికి సంబంధించి... ఏడాదికి 3 సిలెండర్లు అని చెప్పి తొలి ఏడాదే రెండు సిలిండర్లు ఎగనామం పెట్టారు. రెండో ఏడాది రెండో విడతతీసుకుంటే అందులో 64 లక్షల మంది లబ్ధిదార్లు బుక్ చేసుకుంటే.. వారికి ఇవ్వాల్సిన సబ్సిడీ రూ.300 కోట్లు ఎగనామం పెట్టారు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లలో 1.59 కోట్ల మంది లబ్దిదార్లు ఉన్నారని కేంద్రం చెప్పింది. వాళ్ల అకౌంట్లలోనే నేరుగా మూడు సిలెండర్ల డబ్బులు నేరుగా జమ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ.. ప్రభుత్వం మాత్రం ఆ పని చేయడం లేదు. అంతే కాకుండా ఇక్కడ కూడా కోత పెడుతున్న కూటమి ప్రభుత్వం 1.59 కోట్ల మంది లబ్దిదారుల్లో కేవలం 1.04 కోట్ల మంది లబ్దిదార్లు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తూ... 55 లక్షల మందికి దీపం పథకం ఎగనామం పెడుతుంది. వీళ్లందరికీ ఏడాదికి మూడు సిలెండర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకివచ్చిన తర్వాత ఒక్క ఆడబిడ్డకు కూడా పెళ్లి కానుక కింద సాయం చేయలేదు. మరోవైపు మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. ప్రతి నియోజకవర్గంలో 500 మందిని ఎంపిక చేసి రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సాయం చేస్తామని చెప్పింది. చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా షణ్ముక వ్యూహం అని హామీ ఇచ్చారే తప్ప ఒక్కరికీ ఈ పథకం కింద సాయం చేయలేదు. మీ చరిత్ర మొత్తం మహిళలను మోసం చేయడమే. ఏ హామీ అమలు చేయకుండా సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని ఎలా చెప్పుకుంటారు.కచ్చితంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలి. 2014 లో అధికారంలోకి రావడం కోసం రూ.14,200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తామని టోక్రా వేసిన మీకు ఇంకా మహిళల మీద ఇంకా మీ పగ తీరలేదా చంద్రబాబు గారూ? ఇప్పుడు మరలా డ్వాక్రా మహిళలకు రూ.2000 కోట్లు సున్నావడ్డీ బకాయిలు ఎగనామం పెట్టినా మీ పగ తీరలేదా ? అని కూటమి ప్రభుత్వ పెద్దలను నిలదీశారు. ఇంతలా ఎందుకు మహిళల మీద పగపట్టారని ప్రశ్నించిన వరుదు కళ్యాణి.. తక్షణమే సున్నావడ్డీ పథకం నిలిపివేయాలన్న ఆలోచనను విరమించుకుని, వారికి రుణాలు మంజారు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలపై మీ కక్ష ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మహిళలు మీకు తగిన బుద్ది చెప్పి, అడ్రస్ లేకుండా చేయడం ఖాయమని హెచ్చరించారు.