కూటమి నేతలే కీచకులు

రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌రువు

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఆగ్ర‌హం

వైయ‌స్ఆర్ జిల్లా:  టీడీపీ కూట‌మి పాల‌న‌లో అధికార పార్టీ నేత‌లే కీచ‌కులుగా మారుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌రువైంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మహిళలను వేధింపులకు గురిచేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులపై చర్యలు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. సోమ‌వారం రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..`స్త్రీలకు భద్రత కరువైంది...కూటమి నేతలే కీచకులుఅవుతున్నారు. మహిళల పట్ల టీడీపీ కి చెందిన ఎమ్మెల్యే, మంత్రులు కీచకుల్లా వ్యవహరించారు.  టిడిపి చెందిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్  జూనియర్ ఎన్టీఆర్ ను తల్లిని దూషించినా ఇంతవరకు చర్యలు లేవు. దగ్గుపాటి ప్రసాద్ ఇంటి వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారా..? ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా ఎదుగుతాడనే అసూయతో దగ్గుపాటి ప్రసాద్ ను వెనుకేసుకొస్తున్నారు.  స్త్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే అదే వారికి చివరి రోజు అని ప్రకటనలు చేసిన చంద్రబాబు.. వీరిపై చర్యలు ఎక్కడ బాబు..?  అయ్యన్న పాత్రుడు పోలీసులను అసభ్యంగా మాట్లాడినా ముఖ్య‌మంత్రి, డిప్యూటీ ముఖ్య‌మంత్రి ఏమాత్రం నోరు మెదపలేదు` అంటూ శివ‌ప్ర‌సాద్‌రెడ్డి త‌ప్పుప‌ట్టారు.

Back to Top