తాడేపల్లి: ప్రాణనష్టానికి ఏదీ పూడ్చలేనప్పటికీ, ప్రభుత్వం నుండి కొంత ఆర్థిక సహాయం అందించింది. బాధిత కుటుంబాలు తక్షణ ఆర్థిక భారాన్ని అధిగమించడంలో సహాయపడతాయని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రైలు ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఆర్థిక చేయడం పట్ల విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.. రైలు ప్రమాదంలో మరణించిన వారికి రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ప్రకటించిందని విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు రూపొందించిన ఏపీ ఆరోగ్య మౌలిక సదుపాయాలు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆరోగ్య సేవలు విస్తరించడం పట్ల కేంద్రం ప్రశంసించడం ఆనందంగా ఉందని విజయసాయిరెడ్డి అంతకుముందు మరో ట్వీట్ చేశారు. ఆరోగ్య శ్రీ సేవలు 1,055 నుండి 3,257కి పెంచింది. 90 శాతం వ్యాధులకు ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేరుస్తూ వైయస్ జగన్ 2,275 వ్యాధులు అదనంగా చేర్చి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు.