నీ వస్త్ర సన్యాసం గురించి ఎవరూ మాట్లాడరేమిటి చంద్రం అన్నయ్యా? 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విశాఖ‌:  ఇవే చివ‌రి ఎన్నిక‌లు అంటూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. చంద్రం అన్నయ్యా...! ఇవే చివరి ఎన్నికలు అంటూ నువ్వు ఈ రోజు అస్త్ర సన్యాసం చేశావని డిబేట్లు నడుపుతున్నారు గానీ...45 ఏళ్ళుగా నువ్వు చేసిన రాజకీయ వస్త్ర సన్యాసం గురించి ఎవరూ మాట్లాడరేమిటి అన్నయ్యా? యూ ఆర్‌ సో లక్కీ! అంటూ ట్వీట్ చేశారు.

సిగ్గుపడకు అన్నయ్యా...
ప్రియమైన చంద్రం అన్నయ్యా! మొదట్లోనే నిన్ను చంద్రగిరి ఛీ పొమ్మంది. ఆ తరవాత హైదరాబాద్‌ తన్ని తరిమింది. ఇంతకు ముందే ఉత్తరాంధ్ర ఉమ్మేసింది. ఇప్పుడు రాయలసీమ కూడా నిన్ను గో బ్యాక్‌ అంటోంది! అయినా సిగ్గుపడకు అన్నయ్యా...ఎల్లో కుల మీడియాలో నీకు కావాల్సినంత ప్లేస్‌ ఉంది! అంటూ మ‌రో ట్వీట్ చేశారు.

లోకేష్‌..సౌండ్ పెంచమాకు
హోదాను తాకట్టుపెట్టి ప్యాకేజీ చాలన్న కేబినెట్లో నువ్వు కూడా మంత్రివి కదరా చెత్త నాకేష్! 14 ఏళ్లు సిఎంగా ఉండి వైయ‌స్ జగన్ గారి చదువులపై నీ బాబు దర్యాప్తు జరిపించ లేకపోయాడా? నీ టెన్త్, ఇంటర్ పేపర్లు ఇప్పటికీ మిస్సింగే! ఒక్కో ఎగ్జామ్ ఒకరు రాశారంట. నవరంధ్రాలు మూస్కో. సౌండ్ పెంచమాకు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ఇవాళ ఉద‌యం ఇంకో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top