చదువుకునే పిల్లల సంఖ్య పెంచడం గురుపూజ కాదా, బాబులూ?

టీచర్స్‌ డే రోజు నీతులు వల్లిస్తున్న తండ్రీకొడుకులు!

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఫైర్‌

తాడేప‌ల్లి: ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కొడుకు లోకేష్  ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షంపై నిందలేయడం మానలేదని, అధికారం లేకపోవడంతో దొరికిన తీరిక వారి నోళ్లకు హద్దూ అదుపూ లేకుండా చేస్తోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబు, లోకేష్ తీరుపై ఓ స్టోరీని పోస్ట్‌ చేశారు. 

టీచర్స్‌ డే రోజున– విద్యాభ్యాసంలో గురువుల పాత్ర, పేద పిల్లల చదువుకున్న ప్రాధాన్యం గురించి గుర్తుచేయకుండా, వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలో టీచర్లకు అన్యాయం జరుగుతోందనే అభాండాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ లోకేష్‌ వేశారు. టీచర్లు, స్కూళ్ల ఉనికికి, ప్రగతికి కీలకమైన విద్యార్థుల హాజరు, పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వాన నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యల గురించి సమస్త ఆంధ్ర ప్రజానీకానికి తెలుసు. 

జగనన్న అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, విద్యా కానుక వంటి పథకాలతో పేద, దిగువ మధ్య తరగతి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరి చదువు విజయవంతంగా కొనసాగించడానికి వైయ‌స్సార్సీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. విద్యార్థుల చదువుపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా ఉపాధ్యాయుల సంక్షేమానికి, వారి ఉద్యోగ భద్రతకు కృషి చేయడం ప్రస్తుత ఏపీ విద్యారంగంలో కొట్టవచ్చినట్టు కనపడే గొప్ప మార్పు. బడి పిల్లలే కేంద్రంగా అనేక విద్యా పథకాలు రూపొందిస్తున్న ప్రభుత్వం పరోక్షంగా, ప్రత్యక్షంగా టీచర్ల ప్రగతికే దోహదం చేస్తోంది. 

ఇవేమీ పట్టని తెలుగుదేశం ముఖ్యంగా ఈ పార్టీ ‘అగ్రనేతలు’ టీచర్లకు బోధనేతర బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ అడ్డగోలు ఆరోపణలకు తెగబడుతున్నారు. ఉపాధ్యాయులు తమ విద్యాసంస్థల్లో పిల్లలకు పాఠాలు చెప్పడంతో పాటు జనాభా లెక్కల సేకరణ, ఓటర్ల నమోదు వంటి బోధనేతర విధులు ఎప్పటి నుంచో నిర్వర్తిస్తున్నారు. ముఖ్యమంత్రిగా దశాబ్దానికి పైగా అధికారాలు చెలాయించిన చంద్రబాబు ఇప్పుడు ఈ విషయాలేమీ తెలియనట్టు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. గురువుకు దణ్ణం పెట్టాలని, అమ్మకు అన్నం పెట్టాలని నేడు నీతులు వల్లిస్తున్న చినబాబు నాడు పబ్లిక్‌ స్కూల్లో తన గురువులకు ఎంత మర్యాద ఇచ్చాడో, ఇప్పుడు తన మాతృమూర్తికి ఎంత తిండి పెడుతున్నాడో జనానికి తెలియదనుకుంటున్నాడు. ఎంత తండ్రి కేబినెట్‌లో కీలక మంత్రిగా పనిచేసినా అంత ధీమా ఏ కొడుకుకూ పనికి రాదు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top