సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ముస్లిం ఎమ్మెల్సీల కృత‌జ్ఞ‌త‌లు

అసెంబ్లీ: శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ను శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ మయాన జకియా ఖానం, ముస్లిం ఎమ్మెల్సీలు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఉర్ధూ బాషను సెకండ్‌ లాంగ్వేజ్‌గా ప్రకటించడం, మైనార్టీల అభ్యున్నతికి ఉపయోగపడే విధంగా సబ్‌ప్లాన్‌ను ది మైనారిటీ కాంపొనెంట్‌గా మారుస్తూ శాసనమండలిలో బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించడంపై ముఖ్యమంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ జ‌కియా ఖానం, ఎమ్మెల్సీలు షేక్‌ మహ్మద్‌ ఇక్భాల్, ఇసాక్‌ బాషా, ఎం.డి.రుహుల్లా పుష్ప‌గుచ్ఛం అంద‌జేసి ధ‌న్య‌వాదాలు తెలిపారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top