పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్ ప‌నులు పూర్తి చేయాలి

 కేంద్ర రైల్వే మంత్రికి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల విన‌తి
 

న్యూఢిల్లీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టు ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కోరారు. మంగ‌ళ‌వారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయి రెడ్డి నేతృత్వంలోని పార్టీ ఎంపీల బృందం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని అభ్యర్థించింది. 

 2030 నాటికి దేశంలో 500 గిగావాట్ల 
రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
 ప్రధానమంత్రి కాప్‌ 26 సద్దసులో చేసిన ప్రకటనకు అనుగుణంగా దేశంలో 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర స్థాపిత  పునరుద్పాక ఇంధన సామర్ధ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పునరుద్పాతక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్‌.కె. సింగ్‌ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. పునరుద్పాదక ఇంధన రంగంలో 28 ఫిబ్రవరి 2022 నాటికి 152 గిగావాట్ల స్థాపిత సామర్ధ్యాన్ని సాధించినట్లు ఆయన చెప్పారు. ఇందులో అతిపెద్ద జలవిద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. మరో 72.61 గిగావాట్ల సామర్ధ్యం కలిగిన ప్రాజెక్ట్‌లు వేర్వేరు దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. 21.11 గిగావాట్ల సామర్ధ్యం కలిగిన ప్రాజెక్ట్‌లు టెండరు దశలో ఉన్నట్లు మంత్రి తెలిపారు.
గడచిన మూడేళ్ళ కాలంలో చూస్తే 2019-20లో 9,061 మెగావాట్లు, 2020-21లో 7866 మెగావాట్లు 2021-22 ఫిబ్రవరి నాటికి 10,786 మెగా వాట్ల స్థాపిత శక్తితో పునరుద్పాదక ఇంధన ప్రాజెక్ట్‌ల ఏర్పాటు జరిగినట్లు మంత్రి వివరించారు. కోవిడ్‌ కారణంగా 2020-21లో ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులలో జాప్యం జరిగిందని చెప్పారు. దేశంలో పునరుద్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్‌లలో అత్యధిక ప్రైవేట్‌ రంగ డెవలపర్స్‌ ద్వారా జరుగుతున్నట్లు చెప్పారు. 25 ఏళ్ళ పాటు టారిఫ్‌ నికరంగా ఉంటుందన్న హామీ కారణంగా జరిగే పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్ల వలన ప్రైవేట్‌ రంగ పెట్టుబడిదారుల్లో ఆత్మవిశ్వాసం కలిగించినట్లు మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 2015-16 నుంచి 2021 ఫిబ్రవరి వరకు పునరుద్పాదకయేతర విద్యుత్‌ రంగంలో 4,138 మెగా వాట్ల స్థాపిత సామర్ధ్య అదనంగా వచ్చినట్లు మంత్రి వివరించారు.
 
ఏపీలో ఒక ఆయుర్వేదిక్, మూడు హోమియో ఆయుష్‌ విద్యా సంస్థలు...
  ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఒక ఆయుర్వేదిక్‌, మూడు హోమియో ఆయుష్‌ విద్యా సంస్థలు ఉన్నట్లు కేంద్ర ఆయుష్‌ మంత్రి  శర్బానంద్‌ సోనోవాల్‌ తెలిపారు. రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ప్రజారోగ్యం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పారు. ఆయుష్‌ విద్యాసంస్థల స్థాపన ఆయా రాష్ట్రల పరిధిలోకి వస్తుందని అన్నారు. అయితే కేంద్ర ప్రాయోజిత పథకం అయిన జాతీయ ఆయుష్‌ మిషన్‌ కింద కొత్తగా ఏర్పాటు చేసే ఆయుష్‌ కాలేజీలకు ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి చెప్పారు. జాతీయ ఆయుష్‌ మిషన్‌ కింద విశాఖపట్నంలోని ప్రభుత్వ నేచురోపతి, యోగా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం 2016-17లో 3 కోట్ల 20 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం చేసినట్లు తెలిపారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top