కరోనా వ్యాప్తి నివారణలో డాక్టర్ల కృషి అభినందనీయం

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో డాక్టర్లు అందించే సేవలు వెల కట్టలేనివని కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. లీగల్‌ అవేర్‌నెస్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ప్రతినిధి పెనుబాల విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కడప రిమ్స్‌ ఆస్పత్రి వైద్యులకు, సిబ్బందికి సుమారు 11 లక్షల విలువైన పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థ సేవాభావంతో ముందుకొచ్చి వైద్యులకు కిట్లను అందజేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో నూతనంగా 16 మెడికల్‌ కళాశాలల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని పరికరాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మాజీ మేయర్‌ సురేష్‌బాబు పాల్గొన్నారు.
 

Back to Top