బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లనే సామాన్యుడికి రక్షణ

మాజీ మంత్రి , వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి

 నెల్లూరు:నెల్లూరు: మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  అందించిన రాజ్యాంగం వల్లనే ఈ రోజు సామాన్యుడికి రక్షణ ఉంద‌ని మాజీ మంత్రి , వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగం అంటే కేవలం ఒక పుస్తకం కాదు… కోట్లాది మంది సామాన్యుల ఆయుధం..అదే ఆయుధంతో ప్రజలు త్వరలో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతార‌ని వ్యాఖ్యానించారు.  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి  , వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి  జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ వేడుకల్లో మాజీ శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య గారు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితమ్మ , పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ.. 

  • ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటున్నాం
  • ప్రజాస్వామ్య విలువలు మరింత బలపడాలి… ప్రతి ఒక్కరు సమాజంలో గౌరవింపబడాలి
  • వైయ‌స్ జ‌గన్‌ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమ సమాజం కోసం నిరంతరం శ్రమించారు
  • డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను మాటల్లోనే కాకుండా ఆచరణలో చూపించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
  • అధికారం అనేది కదిలే మేఘాల్లాంటిది… వస్తుంది, పోతుంది
  • కానీ ప్రజల్లో ఉన్న ప్రేమ, ఆదరణ, అభిమానం రాతిపై చెక్కిన శిల్పాల్లాంటివి… ఎప్పటికీ చెరిగిపోవు
  • వైయ‌స్ జ‌గన్‌ గారిపై ప్రజలకు ఉన్న అభిమానం అలాంటిదే… అది చిరస్థాయిగా ఉంటుంది
  • అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా… వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుంది
  • ఎన్ని అడ్డంకులు, అవరోధాలు వచ్చినా ప్రజల కోసం ధైర్యంగా ఎదుర్కొంటాం
  • జిల్లా ప్రజల శ్వాసే ధ్యాసగా పని చేస్తాం… అధికారం ఉన్నా లేకపోయినా వెనకడుగు వేయం
  • రాబోయే జగనన్న ప్రభుత్వంలో రాజ్యాంగ మౌలిక సూత్రాలు, విలువలు కచ్చితంగా అమలవుతాయి
  • అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ గారికి, జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Back to Top