మంత్రాల‌యంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి

క‌ర్నూలు జిల్లా: మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే  వై. బాలనాగిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.  అనంతరం ఆయన విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం అందించిన హక్కులు, స్వేచ్ఛలు ప్రతి పౌరుడికి సమానమని పేర్కొంటూ, విద్యార్థులు రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ క్రమశిక్షణతో చదువులో ముందుకు సాగాలని సూచించారు. దేశ నిర్మాణంలో విద్యకు కీలక పాత్ర ఉందని, భవిష్యత్తు తరాలే దేశానికి బలమని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Back to Top