రైల్వే కోడూరు పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

రైల్వే కోడూరు: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రైల్వే కోడూరు పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా వందనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కమిటీల నియామకంపై నిర్వహించిన చర్చల్లో రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు  కె. సురేష్ బాబు మరియు మాజీ ఎమ్మెల్యే  కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. కమిటీల నియామకం పారదర్శకంగా, సమన్వయంతో జరగాలని నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.

Back to Top