వైయస్‌ఆర్‌ జిల్లా ప్రజల చిరకాల స్వ‌ప్నం సాకారం

స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు

కల సాకారం చేసిన సీఎం వైయస్‌ జగన్‌కు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో వైయస్‌ఆర్‌ జిల్లా ముఖచిత్రం పూర్తిగా మారబోతుంది. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక సహకారం అవుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడారు. 2007 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి రాయలసీమ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ తేవాలని సంకల్పించారని, వైయస్‌ఆర్‌ మరణించిన తరువాత ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పనులు ఆగిపోయాయని చెప్పారు. 

జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని జేఎస్‌డబ్ల్యూ లాంటి పెద్ద సంస్థను ఒప్పించారని, ఈరోజు ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నామన్నారు. సరిగ్గా రెండు మూడు సంవత్సరాల్లో పనులన్నీ పూర్తయి ఏడాదికి 3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి జరగనుందన్నారు. దాదాపు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు రాబోతున్నందుకు గర్వంగా, సంతోషంగా ఉంది. ఈ కల సాకారం చేయడానికి ఎంతోకృషిచేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. 

కడప స్టీల్‌ ప్లాంట్‌తో వైయస్‌ఆర్‌ జిల్లా ముఖచిత్రమే పూర్తిగా మారబోతుందని ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌తో పాటు చుట్టుపక్కల అనేక ఇండస్ట్రీస్‌ రాబోతున్నాయని, పెద్ద ఎత్తున ఒక టౌన్‌షిప్‌ రాబోతుందన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. వైయస్‌ఆర్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా స్టీల్‌ప్లాంట్‌కు  కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. దాదాపు రూ.700 కోట్లు వెచ్చించి హైవే నుంచి ప్లాంట్‌కు కనెక్టివిటీ, రైల్‌ కనెక్టివిటీ, మైలవరం డ్యామ్‌ నుంచి ప్రతి ఏడాది 2 టీఎంసీలు వాడుకునే విధంగా పైపులైన్‌ నిర్మిస్తున్నారని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున అన్నీ కార్యక్రమాలు రాబోయే రెండు సంవత్సరాల్లో జరగబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. 
 

Back to Top