ఐదు నెలల్లో 80 శాతం హామీలు నెరవేర్చాం

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
 

విశాఖపట్నం: ఐదు నెలల్లోనే 80 శాతం హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖపట్నంలో మహిళా సంఘాలకు రుణ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల పోరాటం తరువాత వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఐదు నెలల పాలనలోనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 80 శాతం హామీలన్నీ నెరవేర్చారన్నారు. తొలి అసెంబ్లీలోనే అన్ని వర్గాలకు మేలు చేసే 20 బిల్లులు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే దక్కిందన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు.

కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై పక్క రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూ పరిష్కార మార్గాలకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. మహిళల సంక్షేమ కోసం సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని వివరించారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. వచ్చే ఐదేళ్ల పాలనలో పేదలకు 25 లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పారు. అన్ని వర్గాలకు మేలు చేస్తున్న వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

Read Also: వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చేందుకు మహిళలే కారణం

 

తాజా ఫోటోలు

Back to Top