ఇన్నాళ్లు చట్టాల కళ్లు గప్పారు..ఇకపై సాధ్యం కాదు..

ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

విజయవాడ–అమరావతి రింగురోడ్డు విషయంలో చంద్రబాబు తీసుకున్న యూటర్న్‌తో పనులు మొదలు కాలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.మొదట భూ సేకరణ తామే చేస్తామని కేంద్రానికి హామీ ఇచ్చి తర్వాత చెరిసగం భరించాలని మెలిక పెట్టారన్నారు.ఈ విషయాన్ని రాజ్యసభలో గడ్కరీ స్వయంగా చెప్పారని ట్విట్‌ చేశారు.నదీ గర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.అవి ఇళ్లు లేని పేదలు కట్టుకున్నవి కాదు..వ్యవస్థల్ని మేనేజ్‌ చేసి పెద్దోళ్లు నిర్మించుకున్నవి..ఇన్నాళ్లు చట్టాల కళ్లు గప్పారు..ఇకపై సాధ్యం కాద‌ని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top