‘రెండు లక్షలు కొట్టు.. బెల్ట్ షాపు పెట్టు!’ 

బాబు సంపద సృష్టిపై ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనపై వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు సంపద సృష్టిలో భాగంగా గ్రామాల్లో బెల్ట్‌ షాపుల లైసెన్స్‌ ఇచ్చేస్తున్నారని ఆరోపించారు. దీని కోసం టీడీపీ సిండికేట్ వ్యాపారులు జనాభా ప్రాతిపదికన ధర నిర్ణయం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..
‘చంద్రబాబు సంపద సృష్టిలో  భాగంగా గ్రామాల్లో మద్యం దుకాణాల కోసం జనాభా ప్రాతిపదికన ధర నిర్ణయం చేస్తున్నారు.. అధిక మొత్తం వెచ్చించి మద్యం దుకాణాలను దక్కించుకున్న టీడీపీ సిండికేట్ వ్యాపారులు గ్రామాలలో బెల్ట్ షాపులు లైసెన్స్ ఇచ్చేస్తున్నారు. బెల్ట్ షాపులు కోసం జనాభా.. మద్యం విక్రయాల.. స్థాయిని బట్టి రెండు లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు.. ఇందులో స్థానిక టీడీపీ నాయకులే మొత్తం ప్రక్రియలు చక్రం తిప్పుతున్నారు.. ఎక్సైజ్ అధికారులు అటువైపు చూడకుండా.. దరిదాపుల్లో మరో బెల్ట్ షాపు ఏర్పడకుండా.. సిండికేట్ వ్యాపారులే అన్నీ చూసుకుంటున్నారు.. అందుకే అనేది ఈ టీడీపీ ప్రభుత్వాన్ని దొంగ ప్రభుత్వం.. దోపిడీ ప్రభుత్వం అని’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.  

Back to Top