తాడేపల్లి: ప్రపంచంలోనే అతిపెద్ద పాల సొసైటీ అమూల్‌ను సీఎం వైయస్ జగన్ రాష్ట్రానికి ఆహ్వానిస్తే చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. అమూల్ పాల సొసైటీ రాష్ట్రానికి వస్తుంటే.. చంద్రబాబు విషప్రచారాలు మొదలు పెట్టించాడని మండిపడ్డారు. హెరిటేజ్ కోసం విజయా డెయిరీని ఖతం చేశాడని ధ్వజమెత్తారు. సేకరణ ధర పెరుగుతుందని పాడి రైతులు మురిసిపోతుంటే చంద్రబాబు మాత్రం పొర్లిపొర్లి ఏడుస్తున్నాడన్నారు. మరో రెండేళ్ల పాటు నీటికి ఢోకా లేదు అదే విధంగా ‘భారీ ప్రాజెక్టులన్నీ చాలా ఏళ్ల తర్వాత నిండు కుండల్లా జలశోభను సంతరించుకున్నాయి. శ్రీశైలం, సోమశిల క్రెస్టు గేట్లు ఇంకా తెరుచుకునే ఉండగా, కండలేరు పూర్తి కెపాసిటీకి దగ్గరవుతోంది. మీడియం ఇరిగేషన్ డ్యాంలన్నీ వరద నీటితో కళకళలాడుతున్నాయి. మరో రెండేళ్ల పాటు నీటికి ఢోకా లేదు’ అని మరో ట్వీట్ చేశారు.