ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే..

పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను కేంద్రం నిలబెట్టుకోవాలి

లోక్‌సభలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వంగా గీత డిమాండ్‌

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ సభ్యురాలు వంగా గీత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో రూల్‌ 377 కింద ఎంపీ వంగా గీత మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని ఆ వాగ్దానాన్ని అమలు చేయాలన్నారు. అదే విధంగా పార్లమెంట్‌లో ఇచ్చిన విభజన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. ఏపీలో గ్యాస్‌ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సహకాలు, రాయితీలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడిచినా మెజార్టీ హామీలను కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని,  తక్షణమే ఏపీ సమస్యలను కేంద్రం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.  
 

Back to Top