చంద్రబాబుకు ప్రమాదమంటూ ఉంటే అది టీడీపీ వల్లే..

లోకేష్‌ తప్పు చేశాడు కాబట్టే భయపడి ఢిల్లీకి వచ్చాడు

దాక్కోవడానికి ఢిల్లీకి వచ్చి తండ్రిని రక్షించడానికి అంటూ డ్రామాలు

ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో

లోకేష్‌కు వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ నందిగం సురేష్‌ హెచ్చరిక

న్యూఢిల్లీ: తండ్రిని ఏరకంగానైనా అడ్డు తొలగించుకోవాలని లోకేష్‌ చూస్తున్నాడని రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, జైల్లో ఉన్న చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉంటే అది టీడీపీ వల్లే తప్ప మరే ఇతర వ్యక్తి వల్ల అసలుండదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ సభ్యులు నందిగం సురేష్‌ అన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని, అవినీతి చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని చెప్పారు. స్కిల్‌ స్కామ్‌లో లోకేష్‌ కూడా వాటాదారుడని, ఆయన్ను కూడా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో ఎంపీ నందిగం సురేష్‌ మీడియాతో మాట్లాడారు. 

లోకేష్‌ తప్పు చేశాడు కాబట్టే భయపడి ఢిల్లీకి వచ్చాడన్నారు. ఏ తప్పు చేయకపోతే సాయంత్రం ఫ్లైట్‌లో ఏపీకి వెళ్లొచ్చు కదా.. అని నిలదీశారు. దాక్కోవడానికి ఢిల్లీకి వచ్చి తండ్రిని రక్షించడానికి అంటూ లోకేష్‌ డ్రామాలు ఆడుతున్నాడన్నారు. రఘురామకృష్ణంరాజు అనే వ్యక్తి వద్ద ఆశ్రయం పొందుతూ దొంగలా ఢిల్లీలో తిరుగుతున్నాడన్నారు. 

విజిటర్‌ పాస్‌ మీద పార్లమెంట్‌లోకి వచ్చి గాంధీజీ విగ్రహం వద్ద కూర్చొని ఫొటో తీసుకొని వెళ్లాడన్నారు. గాంధీజీ బొమ్మ వద్ద నిరసన తెలియజేశానని ఫొటో కోసం లోకేష్‌ వచ్చాడు తప్ప.. నిజంగా తండ్రి కోసం మాత్రం కాదన్నారు.  

లోకేష్, బాలకృష్ణ మాట్లాడే విధానం ప్రజలంతా గమనిస్తున్నారని, టీడీపీని రాష్ట్ర ప్రజలు వద్దనుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో చేయలేనిది సీఎం వైయస్‌ జగన్‌ నాలుగేళ్లలో పేదలకు మంచి చేసి చూపించారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆదుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. లోకేష్‌ ఇప్పటికైనా సానుభూతి డ్రామాలు ఆపితే మంచిదన్నారు.  

మెంటల్‌ సర్టిఫికెట్‌ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా అనర్హుడని, బాలకృష్ణను ఎన్నికల కమిషన్‌ అనర్హుడిగా గుర్తించాలన్నారు. బాలకృష్ణపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు అన్ని సౌకర్యాలు పొందుతున్నారని, బాబు ప్రమాదం అంటూ పొంచి ఉంటే.. అది టీడీపీ వల్లే తప్ప మరో వ్యక్తి వల్ల అసలే ఉండదన్నారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి లోకేష్‌ పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఊరుకునేది లేదని ఎంపీ నందిగం సురేష్‌ హెచ్చరించారు. 

 

తాజా వీడియోలు

Back to Top