డాక్ట‌ర్ అచ్చెన్న హ‌త్య వ్య‌వ‌హారంలో రాజ‌కీయాలు త‌గ‌దు

వ్యక్తుల మధ్య గొడవపైనా చంద్రబాబు రాజకీయం

బాబుకు వత్తాసుగా ఎల్లో మీడియా దుష్ప్రచారం

అచ్చెన్న హత్యకు వ్యక్తిగత గొడవలే కారణం

డ్యూటీ విషయంలో విభేదాలు ఘర్షణతో ఆయన హత్య

బాధ్యులను అరెస్టు చేశారు. అయినా బాబు నీచ రాజకీయం

దళితుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు ఉందా?

రామోజీరావుకు అసలు దళితులు, వారి గురించి తెలుసా?

మా ప్రభుత్వంలో దళితులకు పూర్తి న్యాయం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అండగా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌

తాడేప‌ల్లి:   కడప జిల్లా బహుళార్ధ పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్‌ చిన్న అచ్చెన్న హ‌త్య విష‌యంలో రాజ‌కీయాలు చేయ‌డం ప్ర‌తిప‌క్షాల‌కు త‌గ‌ద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎంపీ నందిగం సురేష్ అన్నారు.  ఎస్సీల‌ను అడ్డుపెట్టుకుని రాజ‌కీయం చేయ‌డం చంద్ర‌బాబు, ఎల్లోమీడియా మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. డాక్టర్ అచ్చెన్న హత్య వ్యవహారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ అన్నారు. దీనిని రాజకీయం చేయటం కరెక్ట్ కాదన్నారు. లోతుగా విచారణ చేస్తున్నాం.. దోషులు ఎలాంటి వారైనా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు దళితులకు అన్యాయం జరిగిందని మాట్లాడటం హాస్యాస్పదమని కొట్టిపారేశారు. ఎవరైనా దళాతుడిగా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు ఇప్పటి వరకు దళితులను క్షమాపణ చెప్పలేద‌ని  నందిగం సురేష్ మండిప‌డ్డారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఎంపీ నందిగం సురేష్ మీడియాతో మాట్లాడారు.

ఎంపీ నందిగం సురేష్ ఇంకా ఏం మాట్లాడారంటే..
పశు వైద్య శాఖ డైరెక్టర్‌ అచ్చెన్న మరణం చాలా బాధాకరం. ఆయనది హత్యగా తేల్చిన పోలీసులు దోషుల్ని అరెస్టు చేశారు. కానీ ఆ ఘటనను ఎల్లో మీడియా దారుణంగా వక్రీకరిస్తోంది. అచ్చెన్నతో జరిగిన గొడవలో సుభాష్‌చంద్రబోస్‌ అనే వ్యక్తి కొందరితో కలిసి ఆయనను హత్య చేశాడు. డ్యూటీ విషయంలో మొదలైన వారి గొడవ చివరకు చంపుకునే స్థాయికి దారి తీయటం బాధాకరం.

ఎల్లో మీడియా దుష్ప్రచారం..
ఏదేమైనా వ్యక్తుల మధ్య గొడవను కూడా రాజకీయం చేస్తున్న చంద్రబాబు, దాని ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. బాబుకు వత్తాసు పలుకుతున్న ఎల్లో మీడియా అచ్చెన్న హత్యను ప్రభుత్వానికి ఆపాదిస్తూ, అదే పనిగా దుష్ప్రచారం చేస్తోంది. ఆ ఘటనను రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. అచ్చెన్న కుటుంబానికి ప్రభుత్వం తరుపున అందాల్సిన ప్రతి బెనిఫిట్‌ను అందజేసి వారికి భరోసా ఇస్తాం. 

వారి ప్రేమ ఒక కామెడీ..
దళితులపై అదే పనిగా చంద్రబాబు, రామోజీరావు ప్రేమ ఒలక బోస్తుంటే కామెడీగా ఉంది. దళితుల గురించి ఈనాడులో రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రామోజీరావుకు అసలు దళితులు ఎలా ఉంటారో తెలుసా?. చంద్రబాబు ఏం చెబితే అది రాసే రామోజీరావు.. రాష్ట్రంలో ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని, వారిపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాయడం హాస్యాస్పదం. నిజానికి గతంలో ఎస్సీలపై వివక్ష చూపిందెవరు? ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్నదెవరు? మీరు భుజానికి ఎత్తుకుని మోస్తున్న చంద్రబాబు కాదా? ఇవాళ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, రాతులు రాస్తున్న రామోజీ.. మీకు ఆనాడు చంద్రబాబు అన్న మాటలు ఎందుకు గుర్తు రావడం లేదు?. తన మాటలపై ఆ తర్వాత చంద్రబాబు కనీసం క్షమాపణ కూడా కోరలేదు. 

చంద్ర‌బాబు హయాంలోనే దారుణాలు..
ఎస్సీలపై అంత విమర్శ చేసిన చంద్రబాబు, ఆ తర్వాత ఒకసారి నాయి బ్రాహ్మణులు, మరోసారి మత్స్యకారుల తోకలు కట్‌ చేస్తానని అన్నారు. ఎస్సీలు స్నానం చేయరని, వారు శుభ్రంగా ఉండరని కొందరు టీడీపీ నాయకులు వ్యాఖ్యానించారు. ఎస్సీలు అసలు చదువుకోరని కూడా విమర్శించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న దళిత మహిళ అయిన ఎమ్మార్వోను జుట్టు పట్టి ఈడ్చింది టీడీపీ నేతనే. చివరకు ఒక ఎస్సీ మహిళను వివస్త్ర చేసింది చంద్రబాబు పార్టీ నాయకులే. తన హయాంలో ఎస్సీలపై అక్రమ కేసులు పెట్టి చిన్నచూపు చూసింది కూడా చంద్రబాబే. అయినా ఇవేవీ రామోజీరావుకు కనిపించవు. అవసలు గుర్తుండవు. 

మాట్లాడే అర్హతే మీకు లేదు..
అసలు చంద్రబాబుకు కానీ, ఎల్లో మీడియాకు కానీ దళితుల గురించి మాట్లాడే అర్హత లేదు. పేపర్లో ఆ పదం రాసుకోవటం తప్ప చంద్రబాబు ఏనాడూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బాగు పడాలన్న చొరవ చూపలేదు. కానీ ఇప్పుడు అవన్నీ వాస్తవంగా అమలు చేస్తున్నారు సీఎం వైయస్‌ జగన్‌. అందుకే ఎస్సీలను అడ్డు పెట్టుకుని ఇకనైనా నీచ రాజకీయం చేయడం మానుకోవాలి. మీ అవసరాలు, అవకాశాల కోసం దళితుల గురించి మాట్లాడొద్దు. దానికి వంత పాడుతూ ఎల్లో మీడియాలో తాటి కాయంత అక్షరాలు రాయొద్దు. అలా రాసినా కూడా మీ మీద ప్రజలకు నమ్మకం కలగదు. చంద్రబాబును, ఆ పార్టీని ఒక సామాజికవర్గం, అగ్రవర్ణానికి మాత్రమే చెందినట్లుగా భావించారు కాబట్టే, గత ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితం చేశారు. అందుకే మీరు దళితుల గురించి మాట్లాడొద్దు. రాయొద్దు.

సీఎం వైయ‌స్ జగన్‌ సామాజిక న్యాయం.. 
సీఎం వైయస్‌ జగన్‌ తన పాలనలో దళితులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. గతంలో ఏనాడైనా చంద్రబాబు రాజకీయంగా దళితులను ప్రోత్సహించారా? ఆయనకు ఓటు బ్యాంకు, సీఎం సీటు తప్ప ఏదీ కనపడదు. ఈ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు, హోం, మున్సిపల్‌ శాఖల మంత్రి పదవులు దళితులకే ఇచ్చారు. అదే చంద్రబాబు హయాంలో కనీసం ఒక క్రియాశీల పదవైనా ఎస్సీలకు ఇచ్చారా? వారికి మేలు చేశారా? ఏ ఎస్సీ నేతను అయినా చంద్రబాబు తన కారులో ఎక్కించుకున్నారా? సీఎం వైయ‌స్ జగన్‌ ప్రజలే ప్రధానమని పని చేసుకుపోతున్నారు. అందుకే దుష్ప్రచారం చేస్తూ, ప్రభుత్వంపై బురద చల్లొద్దు. అలాగే ఇలాంటి తప్పుడు రాతలు రాయటం మానుకోవాలని ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు.

Back to Top