తాడేపల్లి: చంద్రబాబుకు బానిసగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నాడని, ఏ క్లాస్ వారితో అంటకాగుతున్నావు..? ఏ క్లాస్ వ్యక్తుల దగ్గర ప్యాకేజీ తీసుకున్నావు..? గతంలో ఓడిపోయిన రెండుచోట్లా ఎన్నికల ఖర్చును ఏ క్లాస్ వారి దగ్గర్నుంచి తీసుకున్నావు..? అని పవన్‌ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ ప్రశ్నించారు. వారాహి పేరుతో లారీ ఎక్కి తిరుగుతూ.. సభ జరిగినచోటల్లా ఒక వీధిరౌడీలా, ఆకురౌడీలా మాట్లాడుతున్నాడని, పవన్ పలికే భాష, వ్యవహరించే తీరును గమనిస్తే అతను కచ్చితంగా ఆకురౌడీ కాగలడేమో గానీ ఎమ్మెల్యేగా మాత్రం గెలవలేడన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ నందిగం సురేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. వీధి రౌడీలా పవన్ మాటలు నిన్న భీమవరం బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ మాట్లాడిన తీరును చూస్తే.. ఆయనొక వీధిరౌడీలా, అసాంఘికశక్తిలా మాట్లాడాడు. ఎక్కడా ఆయనొక రాజకీయ నాయకుడనే భావన కలగలేదని.. చోటామోటా రౌడీయిజం చేసే వ్యక్తిలా మాట్లాడాడని ప్రజలంతా భావిస్తున్నారు. ప్రజలకు మేలు చేయాలనే విధంగా ఆయన ప్రసంగం తీరు ఎక్కడా కనిపించలేదు. సినిమాల్లో తాను ఎలా నటించినా ప్రేక్షకులు టిక్కెట్లు కొని చచ్చినట్లు చూస్తారనే భావనతోనే నిన్న భీమవరం బహిరంగ సభను పవన్‌కల్యాణ్ నడిపారు. ఆయన పద్ధతి ఎలా ఉందంటే, తాను ఎవరినైనా తిట్టొచ్చని.. తననెవరూ ప్రశ్నించడానికి వీల్లేదనే అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు. ఏదో చిన్న కుర్రాళ్లంతా హీరో... హీరో అని అరవగానే, తన హీరోయిజం ప్రదర్శించేందుకు మాత్రమే సభ పెట్టినట్లు ఉన్నాడు గానీ.. ఎక్కడా ప్రజల మేలు కోసం కాదని గుర్తుచేస్తున్నాను. బాబుకు బానిసగా పవన్‌కల్యాణ్ చంద్రబాబు ప్రస్తావనకొచ్చేసరికల్లా పవన్‌కల్యాణ్ తన బానిసత్వాన్ని సమర్ధంగా నిరూపించుకుంటున్నాడు. ఎందుకంటే, సభలో బాబు విషయానికొచ్చేసరికి ఒక పొట్టిశ్రీరాములు, ఒక పుచ్చలపల్లి సుందరయ్య అంటూ పోలిక చెబుతున్నారు. బాబుకు బానిసగా పనిచేసే విషయంలో ఎక్కడా అలసటనేది లేకుండా.. చురుగ్గా, సమర్ధవంతంగా పనిచేస్తున్న వ్యక్తిగా పవన్ కల్యాణ్ ను చెప్పుకోవచ్చు. 2019లో కూడా పవన్‌కల్యాణ్ అనే వ్యక్తి గాజువాక, భీమవరంలో ఓడిపోవడానికి కారణం కూడా చంద్రబాబేనని చెప్పాలి. ఎందుకంటే, ఆ రెండు చోట్ల పోటీకి దిగాలని అప్పట్లో బాబే పవన్‌కు చెప్పి నిలబెట్టాడని చాలామంది చెబుతుంటారు. యజమాని చెప్పింది చేయాల్సిందే కనుకే ఆయన ఆ రెండు చోట్ల ఓడిపోయి కూర్చొన్నాడు. గ్లాస్ పవన్‌దైనా.. ఛాయ్‌మాత్రం చంద్రబాబుదే క్లాస్‌వార్ గురించి మాట్లాడే పవన్ ను నేను కొన్ని ప్రశ్నలేస్తున్నాను. వాటిపై సమాధానాలిచ్చే దమ్మూధైర్యం ఉంటే ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాం. ఈ పవన్‌కల్యాణ్ అనే వ్యక్తి ఏ క్లాస్ వారితో అంటకాగుతున్నాడు..? ఏ క్లాస్ వ్యక్తుల దగ్గర ప్యాకేజీ తీసుకున్నావు..? గతంలో ఓడిపోయిన రెండుచోట్లా ఎన్నికల ఖర్చును ఏ క్లాస్ వారి దగ్గర్నుంచి తీసుకున్నావు..? పవన్‌కల్యాణ్ గ్లాసులో టీ పోసింది చంద్రబాబు అని భీమవరం, గాజువాకలో ఏ ఒక్క చిన్నపిల్లోడ్ని అడిగినా చెబుతాడు. పవన్ ను ఆ గ్లాసు పట్టుకుని ఆ రెండు చోట్ల నిల్చోమన్నాడు. ఆ తర్వాత చంద్రబాబు వచ్చి ఆ గ్లాసులో ఛాయ్ పోశాడని పవన్ బాగోతం గురించి ప్రజలే చెబుతున్నారు. పేదలకు పథకాలు ఇస్తే శ్రీలంక అవుతుందా..? పవన్‌కల్యాణ్ అనే వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టింది ప్రజలకు సేవ చేయటానికని అంటున్నాడు. తాను భవిష్యత్తులో ప్రజలకు మేలు చేస్తానంటూ.. ఇప్పటి ప్రభుత్వం అందించిన మేలు కంటే మిన్నగా చేస్తామని చెబుతున్నారు కదా..? రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని డీబీటీ ద్వారా రూ.2.23 లక్షల కోట్ల లబ్ధిని ప్రజలకు అందించారు. దీనిపై ఇటు పవన్‌కల్యాణ్, అటు చంద్రబాబు మాత్రం రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని గుండెలు బాదుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికన్నా మించి మేం చేస్తాం అని చెప్పుకుంటున్నారంటే ఈ బాబు, పవన్‌లకు సిగ్గుందా..? లేదా..? అని అడుగుతున్నాను. ఇక్కడ అమలయ్యే పథకాల్ని కొనసాగిస్తామంటారు. పక్కరాష్ట్రాల్లోని పథకాల్ని కాపీ కొట్టి చేస్తామంటారు. మొత్తానికి వీరిద్దరూ కాపీపేస్టు వీరులని చెప్పుకోవచ్చు. పేదలకు మేలు చేయడం క్లాస్‌వారా..? గ్లాస్‌వారా..? మా నాయకుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ పేదలకు అన్నిరకాలుగా అండగా ఉన్నారన్నది జగమెరిగిన సత్యం. ఆయన మహిళల పేరిట అమరావతిలో ఇళ్లస్థలాలిస్తుంటే.. పెత్తందార్లకు నాయకుడుగా ఉన్న చంద్రబాబు పేదలకు ఇళ్లస్థలాలివ్వరాదని కోర్టులకెక్కాడు కదా..? దీన్ని ఏమని అంటారు పవన్‌కల్యాణ్..? పేదలకు నీడకల్పించడమనేది క్లాస్‌వారా..? గ్లాస్‌వారా..? సమాధానం చెప్పు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతీ విద్యార్థికి ఇంగ్లీషు విద్య అవసరమని.. ప్రతీ పేదింటి బిడ్డ కూడా ఇంగ్లీషులో మాట్లాడాలని ఆకాంక్షించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు విద్యను అమలు చేయడం క్లాస్‌వారా..? గ్లాస్‌వారా..? వీటిని అడ్డుకున్న వారిని ఏ క్లాస్ వ్యక్తులని పవన్ సంభోదిస్తాడో చెప్పాలి. ఊగిపోతే అబద్ధాలు నిజాలవుతాయా..? నువ్వేదో సత్యహరిశ్చంద్రునిలా.. అబద్ధం పలుకని నీతిమంతుడివని నీకు నువ్వే అనుకుంటున్నావు. నిన్నెవరూ ప్రశ్నించకూడదు. ఎవరైనా ఇదేంటయ్యా ..?ఇలా మాట్లాడుతున్నావంటే నీకు ఆవేశం వస్తుంది. పూనకం వచ్చినట్టు ఊగిపోతూ రెచ్చిపోతావు. అసలు, ఊగిపోతే నువ్వు చెప్పే అబద్ధాలు నిజమైపోతాయా పవన్‌కల్యాణ్..? సహజంగా, మత్తుపానీయాలు తాగినోళ్లు ఊగిపోతారు. ఇష్టానుసారంగా వాగుతారు. మరి, ఈ పవన్‌కల్యాణ్ ఎందుకు అలా ఊగుతున్నాడు..? వాస్తవాలెప్పుడూ నీకు కోపం తెప్పిస్తాయి పవన్.. నీ గురించి వ్యక్తిగతంగా ఎవరూ మాట్లాడకూడదంటున్నావు, మరి నువ్వైతే రోజుకు వందమంది గురించి మాట్లాడొచ్చా..? సమాధానం చెప్పి ప్రజలకు స్పష్టతనీయాల్సిన బాధ్యత పవన్‌కల్యాణ్కు ఉంది. వైయస్ జగన్‌ని ఎదుర్కోవడానికి వందతలలతో.. తన మీటింగులకు ఫ్యాన్స్ వస్తున్నారని.. వారి ఓట్లను గంపగుత్తగా చంద్రబాబుకు ఎలా అమ్ముకోవాలా అని ఈ ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నాడు. చంద్రబాబు అధికారానికి ఒక బాట వేయాలని చూస్తున్నాడు. నిజంగా, నువ్వు బాబుకు బానిసవు కాకపోతే.. నువ్వు సింగిల్‌గా జనసేన తరఫున 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టే దమ్ముందా..? అసలు, బాబుతో నువ్వు నడుపుతున్న సంబంధ బాగోతమేంటి..? ఆయన నీకు 2014లో ఏవిధంగా మంచి అయ్యాడు..? 2019కి వచ్చేసరికి మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎందుకు చెడింది..? మీకు మీరే చెప్పుకుంటారు. తగవులంటారు. తిరిగి ఒకటవుతారు. ఒకసారి అలా కలిసిపోదామంటారు. మరోసారి ఇలా విడివిడిగా అంటారు. ఏదిఏమైనా సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ని చూసి ఆ ఇద్దరూ భయపడుతున్నారు. ఆయన్ను ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు బాబు, పవన్‌లు వంద తలలుపెట్టుకుని కసరత్తు చేస్తున్నారు. అబద్ధాల తూకంలో బాబు, పవన్‌లు సమానం పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ గురించి అబద్ధాలు పలికాడు. నిన్నటిదాకా అబద్ధాల చక్రవర్తి చంద్రబాబే అనుకున్నాం. ఇప్పుడు ఈ పవన్‌కల్యాణ్ కూడా అదేవిధంగా తయారయ్యాడు. బాబు దత్తపుత్రుడిగా వారసత్వాన్ని పట్టుకుని అబద్ధాలు, మోసాల్లో పీహెచ్‌డీ చేద్దామని పవన్‌కల్యాణ్ పదేపదే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయాల ద్వారా ఒకటిన్నర లక్షల ఉద్యోగాలు, వైద్య రంగంలో మరో 50 వేల ఉద్యోగాలు.. మిగతావి అన్నీ కలుపుకుని రెండున్నర లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా.. పవన్ ఆకురౌడీ అవుతాడేమో గానీ ఎమ్మెల్యే కాలేడు వారాహి పేరుతో లారీ ఎక్కి తిరుగుతూ, సభ జరిగినచోటల్లా ఈ పవన్‌కల్యాణ్ ఒక వీధిరౌడీలా.. ఆకురౌడీలా మాట్లాడుతున్నాడు. ఆయన పలికే భాష, వ్యవహరించే తీరును గమనిస్తే అతను ఖచ్చితంగా ఆకురౌడీ కాగలడేమో గానీ ఎమ్మెల్యేగా మాత్రం గెలవలేడు. అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత లేదని తెలిసిపోయింది. ఈ మాత్రం అవగాహన లేని పవన్‌కల్యాణ్ తానింకా ఎమ్మెల్యేగా గెలవగలనని అనుకుంటే ఆ దిశగా అడుగులేస్తూ.. ప్రజలకు అందుబాటులో అణగిమణిగి ఉండాలి. నీకు ఏ అర్హత లేదు. ఏ స్థాయీ నీకు లేకున్నా.. ఎవరిని చూసి ఈర్ష్య పడుతున్నావో..? ఎవరి వలన బాధపడుతున్నావో.. స్టేజీ ఎక్కగానే ఎందుకంత ఆవేశపడుతున్నావో..? ఇలా మాట్లాడాలని చంద్రబాబు ఇచ్చిన డైరెక్షనా..? లేదంటే, నాకంటే చిన్నవయస్సున్న వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారని.. నేనేందుకు కాలేకపోతున్నానన్న ఆక్రోశమా..? నీకు నువ్వు ఆలోచించుకో పవన్‌కల్యాణ్ అని హితవు పలుకుతున్నాను. రాష్ట్రానికి హానికరమైన వ్యక్తిలా పవన్‌కల్యాణ్ జనసేన సోషల్‌మీడియాలో మాత్రం మా పవన్‌కల్యాణ్ కాబోయే సీఎం అంటూ పాపం పుణ్యం తెలియని అమాయకులు తెగ హడావిడి చేస్తున్నారు. మరోవైపు పవన్‌కల్యాణ్ మాత్రం తాను ముఖ్యమంత్రి కాదంటూ.. చంద్రబాబు ప్యాకేజీస్టార్‌నంటూ.. ఆయన కోసం పనిచేయాలి. ఆయనకోసమే మనమంతా బతకాలంటూ.. రాజకీయాల్లో దిక్సూచిని ఏర్పరచుకోకుండా.. దిక్కూదివాణ లేని వ్యక్తిగా పవన్‌కల్యాణ్ వ్యవహరిస్తున్నాడు. కులాల్ని రెచ్చగొడుతూ ఏతావాతా చూస్తే ఈ రాష్ట్రానికి హానికరమైన వ్యక్తిగా పవన్ తయారై ప్రజల్లో ఆందోళనలు కలిగించి గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నిరూపించుకోవాలంటే ఇప్పటికైనా సంస్కారవంతమైన భాషను ఉపయోగించి నీతివంతంగా నడుచుకోవాలని హితవు చెబుతున్నాను. ఎవర్ని బ్లాక్ మెయిల్ చేస్తావ్...? తన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తే అందరి విషయాలను బయటపెడతానని పవన్‌కల్యాణ్ నిన్నేదో హెచ్చరిస్తున్నాడు. ఆయనెవర్ని బెదిరిస్తాడు..? ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన డేటా చంద్రబాబు దగ్గర ఉందేమో.. అందుకే ఆయనంటే పవన్‌కల్యాణ్ భయపడుతున్నాడేమో.. తానెవరికీ బానిస కాదు. చంద్రబాబుతో తనకేమీ సంబంధంలేదు అని నిరూపించుకోవాలంటే, పవన్ సింగిల్‌గా 175 చోట్ల ఎన్నికల్లో పోటీచేయాలి. అంతేగానీ, ఇలాంటి ఉడుత ఊపులకు బెదిరి చెదిరే రకం కాదు మా వైయస్ జగన్ . జాతీయ పార్టీ కాంగ్రెస్ అధినాయకత్వాన్నే ఎదిరించి బయటకొచ్చి రాజకీయాల్లో మేరుశిఖరంగా ఎదిగిన మా నాయకుడు వైయస్ జగన్ ఎవరికీ బెండ్ అవ్వరు. వైయస్ జగన్ పోరాటం, రాజకీయ విజయాల్ని తెలుసుకుని పవన్‌కల్యాణ్ బిగ్‌స్క్రీన్‌లో వేసుకుని చూసుకుంటే అతని భవిష్యత్‌కు మంచిది.