రైతుల ముసుగులో కిరాయి ఉద్య‌మం

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌

విశాఖప‌ట్నం: అమరావతి రైతుల ముసుగులో చేసేది కిరాయి ఉద్యమం అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం చేసేదే అమరావతి ఉద్యమం అని, డబ్బులిచ్చి పచ్చకండవా లేసి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర  వెనుకబడి ఉందని, విశాఖ పరిపాలన రాజధానిగా వస్తే ఉత్తరాంధ్రాలో వెనుకుబాటుతనం పోతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారని, విశాఖ పరిపాలన రాజధాని అయితే వలసలు తగ్గి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు తథ్యమన్న ఎంపీ సత్యనారాయణ.. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అయితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. త్వరలోనే విశాఖపట్నం పరిపాలన రాజధాని అవుతుందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top