కరోనా ప్రభావంతో ఏపీ ఖజానా ఖాళీ అయ్యింది

ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆర్థికఉద్దీపన ప్రకటించాలి

ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రికి ఎంపీ మిథున్‌రెడ్డి లేఖ

ఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆర్థికఉద్దీపన ప్రకటించాలని, కరోనా వైరస్‌ వల్ల దేశంపై 348 మిలియన్‌ డాలర్ల ప్రభావం పడిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వివరిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి లేఖ రాశారు. కరోనా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ ఖజానా ఖాళీ అయ్యింది. ఆర్థిక వనరుల మార్గాలన్నీ అడుగంటిపోయాయి. ద్రవ్యలోటు లక్ష్యాన్ని తగ్గించాలి. వ్యాపార, పరిశ్రమల రుణాల రికవరీని ఏడాదిపాటు వాయిదా వేయాలి. రాష్ట్రాలు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఆర్‌బీఐతో కలిసి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. 

తాజా వీడియోలు

Back to Top