బలహీనవర్గాల ద్రోహి చంద్రబాబు

రిజర్వేషన్‌పై కోర్టుకు ఎక్కిన బిర్రు ప్రతాప్‌రెడ్డి.. బాబు మనిషే

వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇవ్వకుండా మోసం చేశాడు

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ మార్గని భరత్‌

రాజమండ్రి: తన సామాజికవర్గానికి న్యాయం చేసేందుకు బీసీలను బాబు మోసం చేశాడని, బలహీనవర్గాల ద్రోహి చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ మార్గాని భరత్‌ ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ అనుచరుడు బిర్రు ప్రతాప్‌రెడ్డితో కోర్టులో కేసు వేయించి బీసీ రిజర్వేషన్‌ను అడ్డుకున్నాడని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలు జరగకుండా అడ్డుకొని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిపివేయాలని టీడీపీ కుట్ర చేస్తోందన్నారు. రాజమండ్రిలోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో ఎంపీ మార్గాని భరత్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘14వ ఫైనాన్స్‌ కమిషన్‌ 2020 మార్చి 31న కంప్లీట్‌ అవుతుంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ మొదలవుతుంది. కేంద్రం నుంచి వచ్చే డబ్బు రాకుండా టీడీపీ అడ్డుకుంటుంది. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టలేదు. లాస్ట్‌ టైమ్‌ సుప్రీం కోర్టుకు ఇచ్చిన నివేదికలో 59.85 శాతం ఇది ఆఖరి సారి తరువాత వచ్చే ఎన్నికల్లో 50 మాత్రమే పెడతామని కోర్టుకు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఇది వాస్తవం కాదా.. చంద్రబాబూ..? రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి తన సామాజిక వర్గానికి న్యాయం చేసుకునేందుకు చంద్రబాబు ముందుకు వెళ్తున్నాడు. బీసీ పురోగతిని ఏ మాత్రం కాక్షించడం లేదు.

రాజమండ్రి పార్లమెంట్‌ స్థానమే బీసీలపై చంద్రబాబుకు, సీఎం వైయస్‌ జగన్‌కు మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తుంది. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌కు సంబంధించిన వ్యక్తి బిర్రు ప్రతాప్‌రెడ్డితో కోర్టులో పిటీషన్‌ వేయించారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను వంచించి ప్రభుత్వంపై బురదజల్లేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఎంతోమంది బడుగు, బలహీనవర్గాలకు పెద్దపీట వేసింది. 2014లో ఎన్డీయే ప్రభుత్వంతో భాగస్వాములై రెండు కేంద్ర మంత్రి పదవులు తీసుకున్నారు. ఆ పదవులు అగ్రవర్ణానికి చెందిన అశోక్‌ గజపతి రాజు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరికి ఇచ్చారు. రెండేళ్ల క్రితం రాజ్యసభ సీటు ఇస్తే.. వర్ల రామయ్యను నామినేషన్‌ వేయండి అని సూచనలు ఇచ్చి.. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన కనకమేడల రవీంద్రబాబుకు సీటు కేటాయించారు. బడుగు, బలహీనవర్గాల ద్రోహి చంద్రబాబు’ అని ధ్వజమెత్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top