పెండింగ్‌ అంశాల అమలే మా ప్రధాన అజెండా 

ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెడుతున్నాం

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెడుతున్నామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ చెప్పారు. విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాల అమలే మా ప్రధాన అజెండా అని వివరించారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి మొదలుకాబోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎంపీ మార్గాని భరత్‌ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో కేంద్రం ఆరోజున ఏవైతే అంశాలు పొందుపరిచిందో అవన్నీ రాబట్టుకునే ప్రయత్నం కచ్చితంగా చేస్తామన్నారు. 193 సెక్షన్‌ ప్రకారం నోటీసులు ఇచ్చి స్వల్పకాలిక చర్చకు పట్టుబడతామన్నారు. పోలవరం నిధులు, రూ.18వేల కోట్ల రెవెన్యూ డెఫిసిట్‌ నిధులు, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌ ఇలాంటి పలు అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేస్తామని ఎంపీ భరత్‌ చెప్పారు. 
 

Back to Top