వైయస్ఆర్ జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. చత్తీస్‌గఢ్‌లో ల్యాండ్ మైన్ పేలడంతో చనిపోయిన జవాన్ రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని లేఖలో సీఎంను అవినాష్ రెడ్డి కోరారు. ఇటీవల చత్తీస్‌గఢ్ అంబుజ్‌మడ్‌లో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్ పేలడంతో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి.. సోమవారం రాజేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేష్ కుటుంబ సభ్యులు సాయం కోసం విన్నవించుకున్నారు. దీంతో, వెంటనే స్పందించిన అవినాష్ రెడ్డి.. సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ లేఖలో రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. రాజేష్ కుటుంబానికి తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందించాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే, కుటుంబ పోషణ కోసం రాజేష్ భార్య స్వాతికి మానవతా దృక్పథంతో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, వీర మరణం పొందిన రాజేష్‌కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.