విజయవాడ: స్కిల్ స్కామ్‌లో దత్తతండ్రి అరెస్టును పవన్ కల్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. పవన్ కల్యాణ్‌కు అత్యుత్సాహం ఎక్కువైందన్నారు. అవినీతి చేసిన చంద్రబాబును సపోర్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. విజయవాడలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేసిన అవినీతిలో పవన్, బాలకృష్ణకు వాటా ఉందా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక ఆర్థిక నేరస్తుడని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజాధనాన్ని లూటీ చేశాడని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ బీజేపీతో వివాహం, టీడీపీతో కాపురం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టాడన్నారు. పవన్ చంద్రబాబును నమ్ముకుంటే.. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను నమ్ముకుందని స్పష్టం చేశారు.