దేవినేని ఉమను టీడీపీ పక్కన పెట్టింది

బాబు పాలనలో పట్టిసీమ నుంచి పోలవరం వరకు అవినీతి

పోలవరం మహానేత వైయస్‌ఆర్‌ కలల స్వప్నం

ఆ ప్రాజెక్టు సీఎం వైయస్‌ జగన్‌ పూర్తిచేస్తారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌

తాడేపల్లి: చంద్రబాబు మీద పగతో దేవినేని ఉమా ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడు. అతని ప్రవర్తనతో చంద్రబాబునే కాకుండా ఆఖరికి అతని తండ్రిని కూడా తిట్టించుకునే పరిస్థితికి దేవినేని ఉమ దిగజారిపోయాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు. దేవినేని ఉమను ప్రజలు గెంటేశారు.. టీడీపీ ఒక పక్కకు నెట్టేసిందన్నారు. అందుకే చంద్రబాబు చేసిన ఇసుక దీక్ష వేదికపై కూర్చుంటే కిందకు తోసేశారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు చిత్తుగా ఓడించిన దేవినేని ఉమకు ఇంకా బుద్ధిరాలేదన్నారు. పొంతన లేకుండా మాట్లాడుతూ ప్రజల చేత రోజూ తిట్టించుకుంటున్నాడన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో పోలవరం వెనుకబడి పోయిందని దేవినేని ఉమ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని, కృష్ణా, గోదావరి జలాలు పారుతుంటే ఇసుక ఎలా తీస్తారని ప్రశ్నించారు.  

పోలవరం ప్రాజెక్టు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కలల స్వప్నమని, ఆయన కుమారుడు సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. రివర్స్‌టెండరింగ్‌ ద్వారా వందల కోట్ల రూపాయలు ఆదా చేశామన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. పోలవరం త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. దేవినేని ఉమ 2018 కల్లా పూర్తి చేస్తాం.. రాసుకో అని మాట్లాడాడని, ఎంతమేర పూర్తిచేశారని ప్రశ్నించారు. పోలవరం సోమవారం అని చెప్పి చంద్రబాబు, దేవినేని ఉమ ముడుపులు తీసుకున్నారన్నారు. నచ్చిన వారిని, టీడీపీ కార్యకర్తలను వేలాది బస్సుల్లో పోలవరం సందర్శనకు తీసుకెళ్లి వందల కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. నవయుగ మొహం నచ్చక కాంట్రాక్టర్లను మార్చలేదని, అవినీతిని రూపుమాపేందుకు మార్చామని చెప్పారు. చంద్రబాబు పాలనలో పట్టిసీమ నుంచి పోలవరం వరకు అవినీతి జరిగిందన్నారు.

Read Also: శ్రీవారి సొమ్ము ఇక సేఫ్

 

Back to Top