మహిళల భద్రతకోసం కొత్త బిల్లు

ఉండవల్లి శ్రీదేవి

 

పూజ్య బాపూజీ చెప్పిన విధంగా అర్థరాత్రి ఆడపిల్ల స్వతంత్రంగా నడిచిన రోజే నిజమైన స్వాతంత్ర్యం  వచ్చినట్టు. కానీ మనకు స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా బాపూజీ కన్న కలలు మనం ఎప్పుడైనా నెరవేర్చామా? ప్రతి 15 నిమిషాలకూ ఒక రేప్ జరుగుతోంది. కాల్ మనీ, సెక్స్ రాకెట్ వంటి దారుణాలతో గత ప్రభుత్వం ఏం చేసిందో చూసాం. రిషితేశ్వరి, వనజాక్షిగారికి సంఘటనలు చూసాం. అలాంటివి జరిగినప్పుడల్లా అంబేడ్కర్ స్మృతివనం లాంటి కొత్త విషయాలు తెచ్చి దృష్టి మరల్చేది గత ప్రభుత్వం. నేటి వైయస్ జగన్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు సాధికారత కల్పిస్తోంది. 50% రిజర్వేషన్ కల్పిస్తోంది. బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ అంటూ చెప్పి మా అందరినీ సమాజంలో తల ఎత్తుకునేలా చేసారు. నిన్నటిదాకా అగ్రకులాలను పల్లకిలో మోసాం. నేడు మమ్మల్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు మమ్మల్ని మోస్తున్నారు. తెలంగాణాలో దిశ సంఘటనే చూస్తే అది జరిగింది మారమూలో, అడవిలోనో కాదు. నగరమా, పట్నమా అని తేడా లేకుండా వీధి చివరి నుంచి కూడా మహిళలను అపహరించుకుపోతున్నారు. సామూహిక అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు. ఇంటిలోంచి బయటకెళ్లిన మహిళ తిరిగి ఇంటికొస్తుందా అనే గ్యారెంటీ ఉండటం లేదు. దిశ కేసులో పోలీసులు తమ పరిధి కాదంటూ ఆలస్యం చేయడం వల్లే తమ కూతురు మరణించిందని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఉన్నా కూడా, కఠినమైన శిక్షలు వేయాలని చట్టం చెబుతూన్నా  నిందితులకు శిక్షలు పడటంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 0 FIR ఫైల్ చేయాలని సూచించారు. మహిళలకు సంబంధించిన మిస్సింగ్ లేదా నేరాల విషయంలో పోలీస్ స్టేషన్ పరిధితో నిమిత్తం లేకుండా 0FIR నమోదు చేసేలా చట్టం తెచ్చారు. ఎక్కడా లేని విధంగా ఏపీలో ఈ చట్టాన్ని తెచ్చారు. దీనివల్ల దర్యాప్తులో ఆలస్యం జరగదు. మహిళా భద్రత కోసం మరో కొత్త చట్టం తేబుతున్నారు.  మహిళలకు జగన్ అన్న ఉన్నాడు అనే భరోసా దీనివల్ల కలగబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని మహిళలంతా ఇందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. 

Read Also: మన రాష్ట్రంలోనే కిలో ఉల్లి రూ.25

Back to Top