ఐదేళ్లలో ఐదు తరాలకు సరిపడా దోచుకున్నారు

ప్రాజెక్టుల అంచనాలు పెంచి ప్రజాధనం లూటీ చేశారు

రివర్స్‌టెండరింగ్‌ ద్వారా సీఎం వైయస్‌ జగన్‌ ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

అసెంబ్లీ: గత ప్రభుత్వం ప్రాజెక్టుల అంచనాలను పెంచి ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకుందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు ఐదు తరాలకు సంబంధించిన ఆదాయాన్ని సంపాదించుకోవాలనే లక్ష్యంతో పాలన చేశారన్నారు. కానీ, మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రివర్స్‌టెండరింగ్‌ విధానాన్ని తీసుకువచ్చి ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ..

‘గతంలో టెండర్ల ప్రక్రియలో ఎన్నడూ పారదర్శకత అనే పదానికి అర్థం లేకుండా టెండర్లు జరిగాయి. ఐదేళ్ల పాలనలో రూ.2.30 లక్షల కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. సరాసరి 4.8 శాతం ఎక్సెస్‌ కోడ్‌ చేయడం జరిగింది. రివర్స్‌టెండరింగ్‌ ద్వారా సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వ ఆదా చేసింది మొత్తం రూ.1486.87 కోట్లు. ఇందులో పోలవరం హెడ్‌ వర్క్స్, లెఫ్ట్‌ కనెక్టివిటీ, జెన్‌కో బొగ్గు రవాణా, వెలుగొండ టన్నల్, కంప్యూటర్లు, ప్రింటర్స్‌ కొనుగోలు, 4జీ సిమ్‌కార్డు కొనుగోలు, టిట్‌కో, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు, ఆల్‌తూరుపాడు తదితర టెండర్లు. గతంలో 5 శాతం ఎక్సెస్‌ నుంచి ఈ రోజు దాదాపు 15 శాతం లెస్‌ కోడ్‌ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకుంటే టెండర్ల ప్రక్రియలో ట్రాన్స్‌ఫరెన్సీ తీసుకురావడం వల్లనే. చంద్రబాబు హయాంలో కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే టెండర్లలో పాల్గొనేవి.. బిల్డింగ్‌ నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ.11 వేల కోట్‌ చేసిన పరిస్థితి నుంచి టిట్‌కోకు సంబంధించి రూ.707 కోట్ల టెండర్లను రూ.601 కోట్లకు కోడ్‌ చేశారు. అంటే రూ.106 కోట్లు ఆదా చేశారు. చదరపు అడుగుకు రూ.1310 కోట్‌ చేశారు. గతంలో రూ.11 వేలకు ఇప్పుడున్న రూ.1310కి తేడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి.

చంద్రబాబు హయాంలో టెండర్లు జరిగిన రూ.2.30 లక్షల కోట్ల పనుల్లో దాదాపు 20 శాతం తేడా అంటే రూ.46 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. గత ప్రభుత్వం అప్పజెప్పిన పెండింగ్‌ బిల్లులు రూ.43 వేల కోట్లు ఉన్నాయి. అంటే చంద్రబాబు అప్పట్లో జాగ్రత్తలు తీసుకొని, తన సొంత ఖజానాను పెంచుకునే విధంగా ఆయన పార్టీ, ఎమ్మెల్యేల ఖజానా పెంచే విధంగా ప్రవర్తించకపోయి ఉంటే ఈ రోజున రూ. 43 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉండేవి కాదు. టెండర్ల ద్వారా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. అధికారం ఉన్న ఐదు సంవత్సరాల్లో ఐదు తరాలకు సంబంధించిన ఆదాయాన్ని పొందాలనే దురాశ తప్ప.. చంద్రబాబుది మరొకటి కాదు.

హంద్రీనీవా సృజల స్రవంతి ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు తీసుకురావాలి. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే జీవో 22 విడుదల చేశారు. కాంట్రాక్టర్‌లకు నష్టం కలగకుండా లిబరైజేషన్‌ ఇచ్చే కార్యక్రమం చేశారు. అయితే అది అమలు చేయకుండా 60సీ అనే నిబంధన తీసుకువచ్చి కాంట్రాక్టులు రద్దు చేయడం జరిగింది. ఉదాహరణకు గాలేరు నగరిలో ప్యాకేజీ 28లో రూ.11 కోట్లతో చేపట్టే పనిని రూ.113 కోట్లకు పెంచి తన అనుచరులకు ఇచ్చారు. హంద్రీనీవాలో ప్యాకేజీ2లో రూ.10 కోట్ల పనిని రూ.97 కోట్లకు ఇచ్చారు. ఈ విధంగా ఏ ప్యాకేజీ చూసి పెంచుకొని దోపిడీ చేశారు. 60సీ కింద గొల్లపల్లి రిజర్వాయర్, హంద్రీనీవా ప్యాకేజీ8 నామినేషన్‌ మీద తన అనుచరులకు రూ.200 కోట్ల పనులు ఇచ్చారు. కొత్త స్కీమ్స్‌కు టెండర్లు పిలిచారో.. అనంతపురం జిల్లాకు సంబంధించి బైరవాణి తిప్ప ప్రాజెక్టు, అప్పర్‌పెన్నార్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్స్‌.. అప్పట్లో అప్పర్‌పెన్నార్‌ ప్రాజెక్టుకు కొత్తగా ఏ స్కీమ్‌ లేకుండా నీరు ఎలా ఇస్తారని మేము చాలెంజ్‌ చేశాం..

ఈ రోజు మన ముఖ్యమంత్రి కొత్తగా జీఓ ఇవ్వబోతున్నారు. పేరూరు డ్యామ్‌కు ఒక టీఎంసీ ఇవ్వడానికి, ఏ ప్రాజెక్టు కూడా ఇంత వరకు చేపట్టకుండానే ఉన్న ప్రాజెక్టుల ద్వారా మడకశిర బ్రాంచ్‌ కాల్వ ద్వారా నీరు ఇచ్చే అవకాశం ఉంది. బీటీపీకి సంబంధించి లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ నుంచి పేరూరుకు నీరు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఆ ప్రాంత శాసనసభ్యుల కోరిక మేరకు రూ.13 వందల కోట్లతో అంచనాలు రూపొందించారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మేము తప్పుబట్టడంతో దాన్ని రూ. 590 కోట్లకు టెండర్లు పిలిచారు. రూ.590  కోట్ల పనుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత 25 బిలో ఎగ్జిక్యూటెడ్‌ పనులను స్టాల్‌ చేయమని చెప్పినప్పటికీ పనులు చేస్తున్న ఆ కంపెనీ ఇప్పటి వరకు రూ.260 కోట్లు ఎక్కవగా కోట్‌ చేసింది. ఈ విషయమై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి అనుమతి ఇవ్వండి గత ప్రభుత్వం టెండర్లు పిలిచిన దాంట్లోనే రెండు రిజర్వాయర్లు కట్టుకుంటాం. అందులో పుట్టకనుమ అనే చిన్న రిజర్వాయర్‌(0.6 టీఎంసీ)కు రూ.200 కోట్లు ఇచ్చారు. అందులో నాలుగు టీఎంసీలకు సంబంధించి 3 రిజర్వాయర్లు కట్టుకుంటామని కోరాం.. అది ఎలా సాధ్యమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అడిగారని, ఆ రోజు అవసరం ఉన్నా.. లేకపోయినా ప్రతీ కాంట్రాక్టులో 40 శాతం, 50 శాతం అంచనాలు పెంచి పిలిచారు.

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 75 ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ముందుకు తీసుకువచ్చి ఈపీసీ విధానంలో 60 నుంచి 70 శాతం పూర్తిచేయగలిగారు. ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్‌లకు ఒక బాధ్యత ఉంటుంది. ఇప్పుడు సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టం. ఒక రూపాయి కూడా అవినీతి జరగకుండా రివర్స్‌టెండరింగ్‌ తీసుకువచ్చారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వివరించారు.

Read Also: సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో మహిళలకు పెద్దపీట

తాజా వీడియోలు

Back to Top