సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో మహిళలకు పెద్దపీట

దిశ చట్టంతో ఆపదలో ఉన్న అమ్మాయికి జగనన్న వస్తాడనే ధైర్యం వచ్చింది

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

 

అసెంబ్లీ: గొప్ప చరిత్ర ఉన్న భారతగడ్డపై స్త్రీకి భద్రత కరువైంది. మహిళను దైవంగా పూజించే దేశంలో లైంగిక దాడులు, దౌర్జన్యాలు, నేరాలు నిత్యకృత్యాలయ్యాయి. ఆడపిల్ల అర్ధరాత్రి కాదు.. పట్టపగలే తిరిగేందుకు భయపడుతున్నారు. అలాంటి పరిస్థితులను రూపుమాపేందుకు సీఎం వైయస్‌ జగన్‌ దిశ చట్టాన్ని తీసుకువచ్చారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడారంటే..

‘ ప్రతి 15 నిమిషాలకు దేశంలో ఒక రేపు జరుగుతుంది. ఒక స్త్రీ బయటకు వెళ్లిందంటే మళ్లీ ఎప్పుడు వస్తుందోనని భయపడాల్సిన పరిస్థితి. నిర్భయ చట్టం, వరకట్న నిషేధ చట్టం, గృహహింస, లైంగిక వేధింపుల నిషేధ చట్టం వచ్చినా జరిగింది శూన్యం. ప్రతి రోజు పేపర్‌ చూస్తే బాలిక, మహిళలపై దేశంలో ఎక్కడో చోట అత్యాచారం, వేధింపులు వార్తలు వస్తూనే ఉన్నాయి. నిందితుడిని జైల్లో పెట్టే ముప్పుటలా భోజనం పెట్టడం. బాధితురాలు, పోలీసులు తీర్పు కోసం వేచిచూడాల్సిన పరిస్థితి. కురుసభలో శ్రీకృష్ణుడు చీరలు పంపించి చెల్లి ద్రౌపతిని రక్షించినట్లుగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఏ చెల్లెమ్మ అయినా ఆపదలో ఉన్నాను అన్నా అంటే 112 నంబర్‌కు డయల్‌ చేస్తే మహిళా భద్రత టీమ్‌ తక్షణమే వస్తుంది. ఆపదలో ఉన్న అమ్మాయికి గుర్తుకు వచ్చే అన్న సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని సభా ముఖంగా తెలియజేస్తున్నాను.

చంద్రబాబు పాలనలో జీపీఆర్‌ఎస్‌ ద్వారా ఆడవారికి రక్షణ కల్పిస్తానని, మహిళా ప్రొటెక్షన్‌ కోర్టు పెట్టి వెంటనే న్యాయం చేస్తానని చంద్రబాబు చెప్పాడు. మేనిఫెస్టోలో ఊదరగొట్టాడు. ఆయన వస్తేనే బాగుంటుంది.. ఆయన మళ్లీ వస్తున్నాడని టీవీ ప్రకటనల్లో చూశాం. సీన్‌ కట్‌ చేస్తే 2018లో మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం ఏపీ 8వ స్థానం, నీతి అయోగ్‌ రిపోర్టు చూస్తే ప్రతి లక్ష మందిలో దేశంలో 65 మంది ఆడవారిపై అరాచకాలు జరుగుతుంటే.. రాష్ట్రంలో ఆ సంఖ్య 75 మందికి చేరింది. బిహార్, నాగాల్యాండ్, ఉత్తరఖండ్, జార్ఖండ్‌ కంటే ఏపీలో నేరాల సంఖ్య ఎక్కవగా ఉంది. ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరి, జూనియర్‌ డాక్టర్‌ శిల్ప, మెడికో సంధ్యారాణి, కాల్‌మనీ సెక్స్‌రాకెట్, ఎమ్మార్వో వనజాక్షి...  చెప్పుకుంటూ పోతే నారా పాలనలో ఆడవారిపై అత్యాచారాలే కనిపించాయి.

మహిళలపై నేరాలు చేసిన వారిపై తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు టాప్‌ లిస్టులో ఉన్నారని ఏడీఆర్‌ రిపోర్టు చెప్పింది. మహిళలను అగౌరవ పర్చడంలో ఏపీ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉందని చెప్పేందుకు బాధపడుతున్నాను. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మహిళలపై జరిగిన నేరాలు 82,502 జరిగాయి. అందులో అత్యాచార కేసులు సగానికి పైగా అంటే 44 వేలపైన నమోదయ్యాయి. రిషితేశ్వరి హత్యపై కమిటీ వేస్తే ఆ ప్రిన్సిపల్‌ బాబురావును కాపాడేందుకు చూశారు కానీ రిషితేశ్వరికి న్యాయం చేయలేదు. సిట్‌ ద్వారా శిల్ప కేసును దారిమళ్లించారు. ఎందుకుంటే ఆ అమ్మాయి మెయిల్‌లో గవర్నర్, అప్పటి మంత్రి లోకేష్‌ను అడగడం జరిగింది. కానీ సిట్‌ నివేదికను ఎస్వీ మెడికల్‌ కాలేజ్‌ మెంబర్లనే వేశారు. ఆ అమ్మాయి థీరిలో పాస్‌ అయ్యింది కానీ, ప్రాక్టికల్‌లో ఫెయిల్‌ చేశారు. అందుకనే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇక గుంటూరులో సంధ్యరాణి కేసు తీసుకుంటే.. గుంటూరు మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్‌ లక్ష్మి, విజయసారథి ఇద్దరూ హడావుడి చేసి నిందితులను రక్షించారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ 2014–15 మధ్య విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు నేతృత్వంలో జరిగింది. వాళ్ల మనుషులు ఉన్నారని కేసును చంద్రబాబు క్లోజ్‌ చేశారు.

సీఎం వైయస్‌ జగన్‌ మహిళలకు పెద్దపీట వేశారు. మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించారు. దళిత వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించారు. నన్నయ్య యూనివర్సిటీలో ఒక అమ్మాయి సీఎంకు లెటర్‌ రాస్తే వెంటనే స్పందించి ఆ అమ్మాయికి సత్వర న్యాయం చేశారు. మహిళల రక్షణ కోసం దిశ యాక్టు తీసుకువచ్చారు. ఆడపిల్లలను మొదట తండ్రి చూసుకుంటే తరువాత అన్న చూసుకుంటాడు. జీరో ఎఫ్‌ఐఆర్‌ తీసుకువచ్చారు. స్టేషన్‌ పరిధిలో నేరం జరగకపోయినా 166ఏ ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. నేరం తీవ్రత కఠినంగా ఉంటే ఎఫ్‌ఐఆర్‌ చేయాలి.

మహిళలపై సోషల్‌ మీడియాలో అగౌరపరిచేలా పోస్టింగులు పడితే 354ఈ ప్రకారం ఒకసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష, పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354 ఎఫ్‌ కింద 5 నుంచి 7 ఏళ్ల జైలుశిక్ష, మహిళా మిత్ర, సైబర్‌ మిత్ర ద్వారా ఎవరైనా స్టేషన్‌కు రాలేకపోతే 9121211100 నంబర్‌కు ఫోన్‌ చేస్తే వెంటనే వారు ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేస్తారు. జీరో ఎఫ్‌ఐఆర్, స్పెషల్‌ ఫాస్టుర్యాక్‌ కోర్టులు, మహిళా హెల్ప్‌ లైన్‌ 100, 112, 181, చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ 1098, అభయ్‌ పైలెట్‌ ప్రోగ్రాం రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు నేరాలు ఎక్కవగా జరుగుతున్నాయి. నియంత్రణకు 8 ఫోర్‌ విల్లర్స్, 70 టూవిల్లర్స్‌ పెట్టి మహిళా అధికారులను నియమించి అమ్మాయిలు ఎవరైనా ప్రమాదంలో ఉంటే రక్షిస్తారు. ఇంత మంచి బిల్లును ప్రవేశపెట్టిన సీఎం జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు.

Read Also:రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం కంకణం

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top