రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం కంకణం

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
 

 అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కంకణం కట్టుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరర్కొన్నారు.  పారదర్శకత, అవినీతి నిర్మూలన, పూర్వ న్యాయ పరిశీలన, రివర్స్‌ టెండర్లపై జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో అంబటి రాంబాబు మాట్లాడారు.  ఈ చర్చ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు చూడాల్సిన, వినాల్సిన అవసరం ఉంద. ఎందుకంటే అవినీతి అన్నది ముఖ్యంగా ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్‌ వ్యాధి వంటిది. దీన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో గత ఐదేళ్లలో అవినీతి పరాకాష్టకు చేరింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంతటి అవినీతి జరగలేదు. ఈ సందర్భంగా నాకు ప్రహ్లదచరిత్రలోని హిరణ్యకసుడి ఘట్టం గుర్తుకు వస్తుంది. ఇందుకలడు..అందుకలడు అన్న సందేహం లేకుండా ఎందేందుకు వెతికి చూసినా అందందే కలడు. చంద్రబాబు ఎక్కడుంది అవినీతి అంటున్నారు. ఏపీలో అవినీతి సర్వం వ్యాపించింది. ఎక్కడ వ్యతికినా ఉంది. ఈ మైక్‌లో ఉంది. ఈ బల్ల కొన్నదానిలో ఉంది. ఈ బిల్డింగ్‌లోనూ అవినీతే. రాజధానిలోనూ అవినీతి, రోడ్లలో అవినీతి ఉంది. సీ యాక్సెస్‌ రోడ్డులో కిలోమీటర్‌ రోడ్డు వేయడానికి రూ.42 కోట్లు ఖర్చు చేశారు. నేషనల్‌ హైవేలో రూ.10 కోట్లు ఖర్చు చేస్తారు. అంటే రాజధాని రోడ్లలో ఎన్ని కోట్లు మింగారో అర్థమవుతుంది. బిల్డింగ్‌ల నిర్మాణంలో అడుగుకు రూ.1500 ఖర్చు అవుతుంది. ఇక్కడ చంద్రబాబు రూ.11 వేల  అడుగుకు ఇచ్చి బొక్కేశారు. అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలంతా కూడా దోచుకోవడమే. జన్మభూమి కమిటీలన్నీ కూడా పూర్తి అవినీతి కార్యక్రమాలు చేపట్టారు. అవినీతి ఒక పరాకాష్టకు చేరిన తరువాత ఎక్కడో ఒకచోట విరుగుడు ఉంటుంది. ఆ విరుగుడు ఎవరో కాదు.. ముఖ్యమంత్రిగా ఆ భగవంతుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని పంపించారన్న భావన కలుగుతోంది. ఒక దశకు వెళ్లిన తరుఆత దాన్ని సంహరించవలసిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా మనవి చేస్తున్నా..ఎన్నికల్లో చంద్రబాబు వైయస్‌ జగన్‌ను చాలా విమర్శించారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు కాబట్టే ఈ ప్రభుత్వానికి 151 సీట్లు ఇచ్చారు. వైయస్‌ జగన్‌ చాలా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. చాలా కఠోరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాకు ఆశ్చర్యం అవుతోంది. ఈ వ్యవస్థలో ప్రతి అణువు అవినీతి జరిగింది. ఈ అవినీతిని నిర్మూలిస్తానని వైయస్‌ జగన్‌ ఎన్నికల్లో చెప్పారు. అధికారంలోకి వచ్చాక అవినీతిని కూకటి వేళ్లతో పెకిలిస్తున్నారు. రాష్ట్ర ప్రజల తరఫున దేవుడ్ని అడుగుతున్నాను..వైయస్‌ జగన్‌కు బలం ఇవ్వమని కోరుతున్నాను...ఆశీర్వదించండి. రాష్ట్రాన్ని అదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అడుగులు ముందుకు వేస్తున్నారు. 
ఎన్‌సీఈఏఆర్‌ ఎకనమిక్‌ రిసేర్చ్‌ 2016లో ఒక నివేదిక ఇచ్చింది. దేశంలో అవినీతిలో ఏపీ నంబర్‌ వన్‌ అని నివేదిక ఇచ్చింది. సాక్షిలో రాసింది కాదు..వైయస్‌ఆర్‌సీపీ చెప్పింది కాదు. 2017లో సీఎన్‌ఎస్‌ కూడా దేశవ్యాప్తంగా సర్వే చేసి..చంద్రబాబు ప్రభుత్వం దేశంలో రెండో స్థానంలో ఉందని సర్వేలో చెప్పారు. అందుకే వైయస్‌ జగన్‌ లాంటి యువకుడు సీఎం కావాలని ప్రజలు చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా అమలు చేయాలని ఢృడసంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రాన్ని అవినీతిరహిత రాష్ట్రంగా చేయాలనే ధృఢ సంకల్పతో సీఎం వైయస్‌ జగన్‌ ప్రయత్నం చేస్తున్నారని హృదయపూర్వకంగా చెబుతున్నాను. రాజకీయ అవినీతి ఉండటానికి వీల్లేదు. గతంలో బదిలీల్లో లంచాలు తీసుకునేవారు. పనుల్లో డబ్బులు తీసుకునేవారు. గతంలో ఆదినారాయణరెడ్డి అనే వ్యక్తిని చంద్రబాబు తన పార్టీలోకి తీసుకున్నారు. జమ్ములమడుగులో అప్పటికే ఉన్న టీడీపీ నేత రామసుబ్బారెడ్డికి చంద్రబాబు ఏం చెప్పారంటే..అవినీతిలో చేరో పావులా తీసుకోవాలని అప్పటి ముఖ్యమంత్రే పంచాయితీ చేస్తే..రాష్ట్రంలో ఎమ్మెల్యేలు దోచుకుంటే తప్పేంటి అనే దోరణిలో వ్యవహరించారు. డబ్బులు ఎక్కడుంటే అక్కడ అవినీతి ఉంటుంది. వైయస్‌ఆర్‌ నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తలో నీటి పారుదల ప్రాజెక్టులపై ఒక శ్వేత పత్రం విడుదల చేశారు. ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులు 40 ఉన్నాయి. వీటికి రూ.17360 కోట్లు అవుతుంది. ఈ విషయం చంద్రబాబు ప్రభుత్వమే శ్వేతపత్రంలో చెప్పింది. గత ఐదేళ్లలో రూ.67, 500 కోట్లకు ఖర్చు చేసినా ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులకు ఖర్చు చేసినా పూర్తి చేయలేదు. ఇంతకన్న పచ్చి దగా, అవినీతికి తార్కాణం ఎక్కడుంటుంది.  దీనిలో 4 శాతం అదనపు అంచనాలు ఇచ్చి పనులు కట్టబెట్టారు.  ఈ విధమైన అన్యాయమైన పరిపాలన అందించారు. అవినీతి నిర్మూలన చేయకపోతే సమాజం అభివృద్ధి చెందదు. రాజుకు పాలకుడికి అవినీతిని అంతం చేయాలనే దృఢసంకల్పం ఉండాలి. ఈ దిశలో ముందుకు వెళ్తున్న వైయస్‌ జగన్‌పై అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. రివర్స్‌టెండరింగ్‌, ముందస్తు న్యాయ సంస్థ ఏర్పాటు చేశారు. రూ.100 కోట్లు పైబడి ఏదైనా కాంట్రాక్ట్‌ వస్తే దాన్ని టైలర్‌మేడ్‌ పద్దతిలో చంద్రబాబు ప్రవేశపెట్టారు. రాజధానిలో స్వీస్‌ చాలెంజ్‌ పద్ధతిలో చేపట్టి టైలర్‌ మెడ్‌ పద్ధతి అమలు చేశారు. దీన్ని  ఎదుర్కోనేందుకు ముందస్తు న్యాయ సమీక్ష పద్ధతిని వైయస్‌ జగన్‌ తీసుకువచ్చారు. మొదటి స్టేజీలోనే అవినీతిని అడ్డుకోవాలని ఈ విధానం ప్రవేశపెట్టారు. రివర్స్‌టెండరింగ్‌ గురించి చెబితే చంద్రబాబు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. పోలవరం, రాజధాని ఆపేశారని చంద్రబాబు అన్నారు. అవినీతిని అంతం చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. నవంబర్‌ 10వ తేదీ వరకు రూ.1213.33 కోట్లు ఆదా అయ్యింది. మంత్రి చెప్పే లెక్కల ప్రకారం రూ.1400 కోట్లు ప్రజాధనం రివర్స్‌టెండరింగ్‌ ద్వారా ఆదా అయ్యింది. రాబోయే కాలంలో ఎంత అవుతుందో చెప్పలేం. ఈ రూ.1400 కోట్లు ఎవరికి జేబుల్లోకి వెళ్లాయి? ప్రజాధనం ఆదా చేసిన వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని మెచ్చుకునే దమ్ము,ధైర్యం ఉందా?. పత్రికల్లో రాసినవన్నీ వింటే ప్రజలు మమ్మల్ని గెలిపించరు కదా?. ఇసుక విధానంలో ఎంత గందరగోళం చేశారు. ఇసుక ఉచితం అన్నారు చంద్రబాబు. తవ్వుకోవడం, అమ్ముకోవడం, ఈ విధానాన్ని ఆపేశారు. ఇసుక ఎవరు అమ్మేశారో ఒక్క కేసు చూపించండి. మీలాగా పంచాయితీలు చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇసుక విధానం త‌ప్పు అన్నారు. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది? మీ పాలనలో ఆ ఆదాయం ఎక్కడికి వెళ్లింది. మద్యం విధానంలో కూడా అవినీతిని అంతం చేసేందుకు దృఢసంకల్పంతో మొత్తాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చారు. తాగుబోతులు తిట్టుకోవడమే మా విధానం. మా నాన్న తాగడం మానేశాడని ఓ పిల్లాడు అనుకోవాలి. నా భర్త తాగుడు మానేశాడని ఓ భార్య అనుకోవాలి. మందు పట్టుకుంటే షాక్‌ కొట్టాలని ఎన్నికల్లోనే చెప్పాం. అదే చేస్తున్నాం. మద్యం వాడకం తగ్గింది. ఆదాయం వస్తోంది. రేపు అర పెగ్గు తాగుతాడు. రేపు మానేస్తాడు. చంద్రబాబు ఆలోచన విధానం ఏంటో అర్థం కావడం లేదు. సవాల్‌ చేస్తున్నా..పేకాట క్లబ్‌లు ఆపేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైయస్‌ జగన్‌ ఒక్కరే అని సవాలు చేస్తున్నాను.  సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు ఒక యువకుడు ప్రయత్నిస్తుంటే దాన్ని హర్షించాల్సింది పోయి కాళ్లు పట్టుకొని లాగుదాం అనే విధానంలో ఉన్నారు. బార్లు కూడా 60 శాతం తగ్గించారు. బార్లు పెట్టాలంటేనే ఇబ్బందికరంగా ఉంది. మా విధానం ప్రజలను తాగుడు నుంచి మాన్పించాలన్నదే. ఇంత మంచి పనులు చేస్తున్న వైయస్‌ జగన్‌ను ఆశీర్వదించమని ప్రజలను కోరుతున్నాను. చంద్రబాబు చాలా గొప్పవాడు అని, దేనైన్నా ఎదుర్కొనే శక్తి ఉందని, 14 ఏళ్లు సీఎంగా పని చేశానని ఆయనకు ఆయనే గొప్పలు చెప్పుకుంటున్నారు. లోపం ఎరిగిన వ్యక్తి కంటే గొప్ప వ్యక్తి ఎవరు ఉండరు. చంద్రబాబు రాజకీయ చరిత్రలో సొంతంగా గెలిచిన చరిత్ర ఉందా? మొన్ననే సింగిల్‌గా వెళ్లారు..అది మీ శక్తి. చంద్రబాబుకు ఇంగ్లీష్‌ రాదు అన్నడం సమంజసం కాదు. బిల్‌క్లింటన్‌, బిల్‌గ్రేట్స్‌, టోనిబ్లేయర్‌ లాంటి పెద్దలు ఇక్కడికి వచ్చి ఆయన ఇంగ్లీష్‌ విని పుంకాలు పుంకాలుగా పుస్తకాలు రాశారు. ఆ కథలన్ని పేపర్లో పడ్డాయి. వాస్తవానికి చంద్రబాబు అసలు ఇంగ్లీష్‌ రాదు. ఆయనకు బట్టర్‌ ఇంగ్లీష్‌ మాత్రమే వచ్చు. ఈ భాషలోనే ఆయన కాలం వెల్లదీస్తున్నారు. ఇంగ్లీష్‌, తెలుగు సమానమని భావించే వ్యక్తి చంద్రబాబు. ఇంగ్లీష్‌ను, తెలుగును కలిసి హైదరాబాద్‌లో చంద్రబాబు అందమైన ఒక వాఖ్యం కనిపెట్టారు. ఎవరిథింగ్‌ మనవాళ్లు బ్రిఫ్డ్‌మీ..టింగ్లీ భాషను కనిపెట్టిన గొప్ప వ్యక్తి చంద్రబాబే. ఈ వాఖ్యం దశదిశలా వ్యాపించారు. ఈ పండితుడిని చూసి తెలంగాణ ప్రజలు సన్మానం చేయాలని ఆలోచన చేస్తే వేగుల వారి ద్వారా విషయం తెలుసుకున్న చంద్రబాబు అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి అమరావతికి పారిపోయి వచ్చాడు. ఆయన అంత గొప్పవారు. ఆయనకు ఇంగ్లీష్‌ రాదనడం సమంజసం కాదు.   

Read Also:వైయస్ జగన్ అవినీతి లేని పారదర్శక పాలన చేస్తున్నారు

Back to Top