ఇలాంటి ప్ర‌తిప‌క్ష నేత ఉండ‌టం ప్ర‌జ‌ల దౌర్భాగ్యం

వైయ‌స్ఆర్‌సీపీ  ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

అనంతపురం: ఏపీ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఉండటం ప్రజల దౌర్భాగ్యమ‌ని, ఆయ‌న‌ ఒక 420 అని రాప్తాడు  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి  విమ‌ర్శించారు. క‌ర్నూలుస‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడిన తీరును ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు.  తన రాజకీయ భవిష్యత్తు పై చంద్రబాబు తీవ్ర మానసిక ఆందోళనతో ఉన్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.  వికేంద్రీకరణ వాదులపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసి, తన నైజాన్ని చూపించారన్నారు.  చంద్రబాబు ఒక 420..  ప్రజలను నిత్యం మోసం చేయటమే చంద్రబాబు నైజం అన్నారు.  చంద్రబాబు - పవన్ కళ్యాణ్ లు రాష్ట్ర ప్రయోజనాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.  చంద్రబాబు- పవన్ కళ్యాణ్ లు కలిసినా వైయ‌స్ జగన్ గారికి ఉన్న ప్రజా బలాన్ని ఇంచి కూడా తగ్గించలేర‌న్నారు.  అమరావతి పై చంద్రబాబు కు చిత్తశుద్ధి ఉంటే .. 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఎందుకు రాజధాని నిర్మించలేకపోయాడ‌ని నిల‌దీశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top