టీడీపీ నేత‌లు ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకుని మాట్లాడాలి

ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు
 

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రిని, త‌మ పార్టీ  పెద్దల గురించి తెలుగుదేశం నాయకులు పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నారని, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు హెచ్చరించారు.తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దాని ద్వారానే వారికి జీతాలు పంపిణీ చేయడం అద్భుతమైన చర్య అన్నారు.  టీడీపీ ప్రభుత్వ హయాంలో డబ్బులు ఇస్తేనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగం వచ్చేదని విమర్శించారు. 

ఇత‌ర రాష్ట్రాలు ఆశ్చ‌ర్య‌పోతున్నాయి
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని గుర్తు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ పనితీరు చూసి ఇతర రాష్ట్రాలు ఆశ్చర్య పోతున్నాయని అన్నారు. దేవినేని ఉమా పనికిమాలిన వాడని  విమర్శించారు. అందుకే అన్ని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే సుధాకర్‌బాబుఎద్దేవా చేశారు. 

Back to Top