భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
 

 

అనంతపురం: గత చంద్రబాబు పాలనలో రాప్తాడులోని ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణకు గురయ్యాయని, టీడీపీ భూకబ్జాలు చేసి కోట్ల సంపాదించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు నకిలీ పాసు పుస్తకాలు తయారు చేసి ప్రభుత్వ భూములను కబ్జాలు చేశారన్నారు. రెవెన్యూ అధికారులను బెదిరించి భూ రికార్డులను తారుమారు చేశారన్నారు. చంద్రబాబు హయాంలో కోటీశ్వరులకు ప్రభుత్వ ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఆక్రమణలకు గురైన భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని పేదలకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top