రాజన్న బిడ్డ సువర్ణపాలన అందిస్తారు

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు నిర్ణయం హర్షణీయం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు

సంతనూతలపాడు: రాజన్న బిడ్డ ముఖ్యమంత్రి వైయస్‌ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సువర్ణ పాలన అందిస్తారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. సంతనూతలపాడులోని నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంట నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 7 లక్షల పరిహారం చెల్లించాలని మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కరువుతో రైతాంగం పూర్తిగా నష్టపోయింది. గత ప్రభుత్వ దుర్మార్గ చర్యలతోనే విత్తనాలు మార్కెట్‌లోకి అందుబాటులోకి రాలేదు. విత్తన సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా చంద్రబాబు ద్రోహం చేశారు. జూన్‌ 8వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని డాంబికాలు పలికిన చంద్రబాబు ఎందుకు విత్తనాలు సమర్చలేదని ప్రశ్నించారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద మనసుతో పాలన చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలనే నిర్ణయం హర్షణీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో గిట్టుబాటు ధరల కోసం రైతులు రోడ్డెక్కిన చంద్రబాబు స్పందించలేదు. కానీ, ఈ రోజున శనగ రైతులకు దారుణమైన నష్టం జరిగితే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించి రూ. 15 వందల మద్దతు ధరను ప్రకటించారు. ధరల స్థిరీకరణ నిధి కోసం రూ. 3 వేల కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది రైతుల ప్రభుత్వం. రాజన్న బిడ్డ సువర్ణ పాలన అందిస్తాడని సుధాకర్‌బాబు అన్నారు.

 

Back to Top