గొప్ప ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ పేరుతెచ్చుకుంటారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు
 

 

తాడేపల్లి: ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సముచిత స్థానం కల్పిస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. వైయస్‌ఆర్‌ ఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న రాజకీయ నాయకులు ఆంధ్రరాష్ట్రం వైపు చూసేలా పాలన చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌.. అందుకు అనుగుణంగా పాలన చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సమానంగా అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ఐదు రోజుల పాలనలోనే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుందని, ఐదేళ్ల పాలనలో గొప్ప ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ పేరుతెచ్చుకుంటారన్నారు.  
గొప్ప పాలన చేసి చూపిస్తారు: ఎమ్మెల్యే కోలగట్ల
ఐదేళ్లలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పాలన సీఎం వైయస్‌ జగన్‌ చేసి చూపిస్తారని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఏలూరు బీసీ గర్జనలో చెప్పిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం మంత్రి పదవులు, నామినేషన్‌ పదవులు ఇస్తానన్నారని కోటగట్ల చెప్పారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను ప్రకటించడం గొప్ప విషయమన్నారు. తనతో పాటు అందరూ సమానమేనని చెప్పారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top